అమీన్పూర్‌లో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

-తుమ్మల పాండురంగా రెడ్డి ముఖ్య అతిథి

అమీన్పూర్‌లో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

పఠాన్ చేరు, (లోకల్ గైడ్ ప్రతినిధి కృష్ణ):

అమీన్పూర్ డివిజన్ పరిధిలోని హనుమాన్ దేవాలయాలలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు అమీన్పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగా రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హిందువులందరూ సనాతన ధర్మాన్ని ఆచరించడం అత్యంత అవసరమని తెలిపారు. భారతీయ పురాణాలలో అపారమైన భక్తి,శక్తి, ధైర్యానికి ప్రతీకగా నిలిచిన హనుమంతుని జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. ముఖ్యంగా నేటితరం యువత హనుమంతుని జీవన విధానాన్ని అనుసరించి స్ఫూర్తి పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కృష్ణ, కల్పన ఉపేందర్ రెడ్డి, మాజీ కోఆప్షన్ సభ్యులు తల్లారి రాములు, సీనియర్ నాయకులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News