చికిత్స పొందుతూ గుర్తు తెలియని వ్యక్తి మృతి

చికిత్స పొందుతూ గుర్తు తెలియని వ్యక్తి మృతి

   చికిత్స పొందుతూ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి జూలై 21 వ తేదీనా100 కాల్ నుండి చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధి నల్లగండ్లలోని ఖజానా జూవెలర్స్ వద్ద ఒక వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉన్నాడని సమాచారం అందడంతో పోలీస్ సిబ్బంది. ఆ చోటుకు చేరుకొని వ్యక్తిని పరిశీలించగా సుమారు 25 నుండి 30 సంవత్సరాల వయస్సు కలిగిన వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉండడంతో అ వ్యక్తిని చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారని అయితే చికిత్స పొందుతున్న ఆ వ్యక్తి శుక్రవారం ఉదయం పది గంటల సమయంలో మృతి చెందడం జరిగిందని తెలిపారు. అయితే మృతుడికి సంబంధించి పూర్తి వివరాలు తెలియరాలేదని పై ఫొటోలోని వ్యక్తి ఎవరికైనా తెలిస్తే చందానగర్ పోలీస్ లకు 9490617118, 
8712663184 ఈ నంబర్లకు సమాచారం ఇవ్వాల్సిందిగా కోరారు.

Tags:

About The Author

Related Posts

Latest News