ఫార్మాస్యూటికల్ పరిశోధనలో భూక్య విజయ్ నాయక్ కి పీహెచ్డీ
పఠాన్ చేరు, (లోకల్ గైడ్ ప్రతినిధి): ఫార్మాస్యూటికల్ పరిశోధనను విజయవంతంగా పూర్తిచేసిన హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ పరిశోధక విద్యార్థి భూక్య విజయ్ నాయక్ ని డాక్టరేట్ వరించింది. పర్యావరణ అనుకూల మాత్రికలలో ఎంచుకున్న ఔషధాల ఎల్ సి, ఎంఎస్, ఏంఎస్ పరిమాణీకరణ, లక్షణీకరణ, స్థిరత్వం కోసం పర్యావరణ అనుకూల విశ్లేషణ వ్యూహాలు, ఏ క్యూ బిడి అనే అంశంపై ఆయన అధ్యయనం చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు. ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న స్కూల్ ఆఫ్ ఫార్మసీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ దుర్గాప్రసాద్ బేడా శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు. డాక్టర్ విజయ్ అధునాతన యుహెచ్ పిఎల్ -/ఏం ఎస్ ఎం ఎస్, హెచ్ పి ఎల్ సి-ఎం ఎస్/ఏం ఎస్ పద్ధతులను ఉపయోగించి ఇక్సాజోమిబ్ సిట్రేట్, పనోబినోస్టాట్, ప్రసుగ్రెల్ వంటి క్లిష్టమైన ఔషధాల క్షీణత ఉత్పత్తుల (డీపీలు) వర్గీకరణపై దృష్టి సారించినట్టు తెలిపారు. ఆయన అధ్యయనంలో సిటాగ్లిప్టిన్, ఇర్బెసార్టన్ యొక్క ఏకకాల పరిమాణీకరణ కూడా ఉందన్నారు. ఎంఆర్ఎం (బహుళ ప్రతిచర్య పర్యవేక్షణ) విధానం, ప్రోటీన్ అవక్షేపణ వెలికితీత (పీపీఈ) పద్ధతులను ఉపయోగించి, డాక్టర్ విజయ్ పరిశోధన కేవలం 50,11 ప్లాస్మాతో నమూనాలను విజయవంతంగా ప్రాసెస్ చేసినట్టు తెలిపారు. ఫార్మకోకైనెటిక్ అధ్యయన భాగం సిటాగ్లిప్టిన్ (ఎస్టీజీ) ఇర్బెసార్టన్ (ఐఆర్బీ) యొక్క ప్లాస్మా గాఢత-సమయ ప్రొఫైల్ ను సమర్థవంతంగా విశ్లేషించిందన్నారు. పర్యావరణ స్పృహతో కూడిన విశ్లేషణాత్మక వ్యూహాల యొక్క వాస్తవ-ప్రపంచ అనువర్తనాలను ఈ అధ్యయనం ప్రదర్శించినట్టు తెలియజేశారు. డాక్టర్ విజయ్ సమర్పించిన సిద్ధాంత వ్యాసం పీహెచీ పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం విశ్వవిద్యాలయం, హైదరాబాద్ అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్ రావు, గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, స్కూల్ ఆఫ్ ఫార్మసీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీ.ఎస్.కుమార్, పలు విభాగాల అధిపతులు, సిబ్బంది పలువురు అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
స్థిరమైన ఔషధ పరిశోధనకు డాక్టర్ భూక్య విజయ్ నాయక్ చేసిన అత్యుత్తమ కృషిని వారు ప్రశంసిస్తూ, హృదయపూర్వక అభినందనలు తెలియజేసినట్టు వివరించారు.
About The Author
Related Posts
