జగన్ ఇంటికెళ్తే కండువా......
నటుడు నిహార్ కపూర్ షాకింగ్ కామెంట్స్ – వైసీపీలో చేరినట్లు కాదు!
లెజెండరీ నటి జయసుధ తనయుడు నిహార్ కపూర్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో, జగన్ ఇంటికి వెళ్లిన సమయంలో వైసీపీ కండువా మెడలో వేసారని, అది పార్టీ చేరిక అని పొరపొచ్చారని స్పష్టం చేశారు. నిహార్ వ్యాఖ్యలతో వైసీపీ సంప్రదాయంపై నెటిజన్లలో చర్చ మొదలైంది.
లెజెండరీ నటి జయసుధ తనయులు నిహార్ కపూర్, శ్రేయాన్ కపూర్ సినిమా రంగంలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. శ్రేయాన్ "బస్తీ" చిత్రంతో నటనకు గుడ్‌బై చెప్పగా, నిహార్ మాత్రం విభిన్న పాత్రలతో టాలీవుడ్లో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న "హరిహర వీరమల్లు" సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న నిహార్, ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర రాజకీయ విషయాన్ని వెల్లడించాడు.
గతంలో ఒకసారి వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ను కలిసి ఆయన నివాసానికి వెళ్లినప్పుడు, జగన్ సమక్షంలో ఆయన మెడలో వైసీపీ కండువా వేసి ఫొటోలు తీసినట్లు నిహార్ తెలిపారు. ఈ ఫొటోలు వైరల్ కావడంతో నిహార్, జయసుధ వైసీపీలో చేరారని వార్తలు షికార్లు చేశాయి. అయితే, తాము వైసీపీలో చేరలేదని, కేవలం అభిమానంగా వెళ్లిన సందర్భంలో కండువా వేసినట్లు మాత్రమే జరిగిందని నిహార్ తేల్చి చెప్పారు.జగన్ ఇంటికి వెళ్లిన ప్రతిఒక్కరికీ పార్టీ కండువా వేయడమా? అనే విధంగా నిహార్ వ్యాఖ్యలు ఉండటంతో, నెటిజన్లు వైసీపీ శైలి పై విమర్శలు గుప్పిస్తున్నారు. జయసుధకు వైఎస్‌పై అభిమానం ఉన్నప్పటికీ, అధికారికంగా పార్టీకి చేరినట్లు ఎక్కడా రుజువులు లేవని కూడా నిహార్ స్పష్టం చేశారు.
ఈ విషయమై సోషల్ మీడియాలో చర్చ కొనసాగుతోంది. "కండువా వేస్తే పార్టీలో చేరినట్లా?" అంటూ నెటిజన్లు ప్రశ్నలు వేస్తున్నారు.
About The Author
Related Posts
