పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్

జూన్ 12న ‘హరిహర వీరమల్లు’ విడుదల
పవన్ కళ్యాణ్ సినిమాల కోసం అతని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. చివరికి వారి నిరీక్షణకు తెరపడే సమయం దగ్గర పడింది. జూన్ 12న “హరిహర వీరమల్లు” ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ భాషల్లో ఈ చిత్రం విడుదలకు మేకర్స్ భారీ సన్నాహాలు చేస్తున్నారు.రిలీజ్ డేట్ సమీపించడంతో ప్రమోషన్‌కు బిగ్ స్పీడ్ పెరిగింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, వీడియోలు, పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా 'మాట వినాలి', 'కొల్లగొట్టినాదిరో', 'అసుర హననం' లాంటి పాటలు ట్రెండింగ్‌లో దూసుకుపోతున్నాయి.ఇప్పుడు నిధి అగర్వాల్ ప్రత్యేక గీతం 'తార తార' విడుదలకు సిద్ధమైంది. మే 28 ఉదయం 10:20 గంటలకు ఈ పాటను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. “ఈ ఏడాది అత్యంత హాట్ ట్రాక్ వినడానికి రెడీగా ఉండండి” అంటూ సోషల్ మీడియా ద్వారా హైప్ క్రియేట్ చేశారు.ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్‌కు జోడిగా నిధి అగర్వాల్ నటించగా, బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఔరంగజేబు పాత్రలో కీలక భూమిక పోషిస్తున్నాడు. ఇది బాబీకి రెండవ తెలుగు చిత్రం కాగా, ‘డాకు మహారాజ్’ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమయ్యాడు.హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ తొలి పాన్ ఇండియా చిత్రం. సినిమాలో ఆయన పేదల కోసం ధనవంతులను దోచే ‘రాబిన్ హుడ్’ తరహా పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఈ క్యారెక్టర్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.చిత్రానికి ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్లు దక్షిణ భారత్‌తో పాటు ఉత్తర భారతదేశంలో కూడా నిర్వహించనున్నట్లు సమాచారం. ముంబైలో జరగనున్న ఈవెంట్‌కు పవన్ కళ్యాణ్‌తో పాటు సల్మాన్ ఖాన్ హాజరవుతారని సమాచారం.
About The Author
Related Posts
Latest News
