రెడ్ వైన్ – మితంగా తాగితే ఆరోగ్యానికి......
లోకల్ గైడ్:
గుండెకు మేలు
రెడ్ వైన్‌లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా రెస్వెరెట్రాల్, ఆంథోసయనిన్స్, కాటెకిన్స్, ప్రోఆంథోసయనైడిన్స్ వంటి సమ్మేళనాలు ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలించి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. ఫలితంగా:
-
కణాలు ఆరోగ్యంగా ఉండి, చర్మానికి కాంతి వస్తుంది
-
మొటిమలు, మచ్చలు తగ్గి, యువతను నిలుపుతుంది
-
రక్తనాళాల నష్టం తగ్గి, కోలెస్ట్రాల్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి
-
రక్తనాళాల్లో క్లాట్స్ కరిగి, వాపులు తక్కువవుతాయి
-
బీపీ కంట్రోల్ అవుతుంది, హార్ట్ ఎటాక్ రిస్క్ తగ్గుతుంది
టైప్ 2 డయాబెటిస్‌కు మేలు
పరిశోధనల ప్రకారం, రెడ్ వైన్ తాగడం వల్ల శరీరం ఇన్సులిన్‌ను సమర్థవంతంగా ఉపయోగిస్తుంది. దీని వల్ల:
-
బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గుతాయి
-
టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి ప్రయోజనం
-
రెస్వెరెట్రాల్ అనే సమ్మేళనం క్యాన్సర్ కణాలను నాశనం చేస్తుంది, ముఖ్యంగా ప్రోస్టేట్, బ్రెస్ట్, కోలన్ క్యాన్సర్లను నివారించవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు
మెదడుకు లాభాలు
రెడ్ వైన్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు:
-
మెదడు కణాలను రక్షిస్తాయి
-
రక్తప్రసరణ మెరుగుపడి జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతుంది
-
మతిమరుపు సమస్యలు తగ్గుతాయి
-
పాలిఫినాల్స్ ప్రీబయోటిక్‌లా పని చేసి జీర్ణవ్యవస్థలో మంచి బ్యాక్టీరియా పెరుగుదలకు దోహదపడతాయి
ఎంత మోతాదులో తాగాలి?
పరిశోధకుల సూచన ప్రకారం:
-
వారానికి రెండు సార్లు, ఒక్కోసారి 150 ml మించకుండా తాగాలి
-
మితిమీరితే నెగటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయని హెచ్చరిస్తున్నారు