మహారాష్ట్రలో భాషా వివాదం మళ్లీ.....
లోకల్ గైడ్: మహారాష్ట్రలో భాషా వివాదం మళ్లీ భగ్గుమన్నది. థానేలో చోటుచేసుకున్న ఘటనపై ఎంఎన్ఎస్ (MNS) పార్టీ ఈ రోజు నిరసన ప్రదర్శన నిర్వహించింది. షాపు ఓనర్లు ఇచ్చిన నిరసన పిలుపుకు వ్యతిరేకంగా ఎంఎన్ఎస్ నేతలు ర్యాలీకి దిగారు. అయితే ఈ ర్యాలీకి పోలీసుల నుంచి అనుమతి లేకపోవడంతో, స్థానిక నేత అవినాశ్ జాదవ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.మహారాష్ట్ర ఏకీకరణ సమితి ఇచ్చిన ర్యాలీ పిలుపును పోలీసులు అడ్డుకున్నారు. మీరా-భయాందర్ ప్రాంతంలో ర్యాలీని నిర్వహించాలనుకున్న నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. థానేతో పాటు పాల్ఘర్ జిల్లాలో కూడా ఎంఎన్ఎస్ నాయకులను అరెస్ట్ చేస్తున్నారు. ఇవాళ తెల్లవారుజామున 3.30 గంటలకు అవినాశ్ జాదవ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్‌కు సంబంధించిన వీడియోను ఎంఎన్ఎస్ పార్టీ తమ సోషల్ మీడియాలో షేర్ చేసింది.మీరా-భయాందర్‌లో ఎంఎన్ఎస్ మోర్చాకు అనుమతి ఇచ్చినట్లు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ తెలిపారు. అయితే, ర్యాలీ రూటును మార్చాలని సూచించినప్పటికీ, పార్టీ అంగీకరించలేదని ఆయన ఆరోపించారు.భాషా వివాదం జూలై 1న భయాందర్‌లో గురైయింది. ఆ రోజు ఫుడ్‌స్టార్ షాప్ ఓనర్‌పై ఎంఎన్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. మరాఠీ మాట్లాడకపోవడం కారణంగా అతడిని కొట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. జోధ్‌పూర్ స్వీట్స్ షాప్‌లో ఉద్యోగి హిందీ మాట్లాడడంతోనే ఈ వివాదం మొదలైందని గుర్తించారు.ఎంఎన్ఎస్ కార్యకర్తల దాడితో పాటు, బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే చేసిన వ్యాఖ్యలు కూడా మహారాష్ట్రలో భాషా వివాదాన్ని మరింత ఉద్రిక్తతకు తీసుకెళ్తున్నాయని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.