రోడ్డు సేఫ్టీ బిల్లును నిరసిస్తూ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా నేడు ఆటోల బందును జయప్రదం చేయండి. ఐ ఎఫ్ టి యు

రోడ్డు సేఫ్టీ బిల్లును నిరసిస్తూ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా నేడు ఆటోల బందును జయప్రదం చేయండి. ఐ ఎఫ్ టి యు

నల్లగొండ జిల్లా ప్రతినిధి .లోకల్ గైడ్.

కేంద్రంలో మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన లేబర్ చట్టాలను నిరసిస్తూ దేశవ్యాప్త కార్మిక సంఘాలు ఇచ్చిన సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ప్రగతిశీల ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్ టి యు అనుబంధం) జిల్లా అధ్యక్షులు బొమ్మిడి నగేష్ పిలుపునిచ్చారు. సోమవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని శ్రామిక భవన్ ఐ ఎఫ్ టి యు కార్యాలయంలో ప్రగతిశీల ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ సమావేశం  జరిగింది. ఈ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పదేళ్ల కాలంలో కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరించాడని కార్పొరేట్ అనుకూల విధానాలను తీసుకొచ్చాడని తెలిపారు రోడ్ సేఫ్టీ బిల్లుమూలంగా మోటార్రంగ కార్మికులకు తీరని నష్టం జరుగుతుందని పేర్కొన్నారు బహుళ జాతి సంస్థలకు ఊడిగం చేసే మోడీ విధానాలను ప్రతీ కార్మికుడు వ్యతిరేకించాలని పేర్కొన్నారు. అనేక త్యాగాలతో సాధించుకున్న ఎనిమిది గంటల పని విధానాన్ని మోడీ రేవంత్ ప్రభుత్వాలు 10 గంటలకు మార్చాయని ఇది కార్మికుల శ్రమను కార్పొరేట్కు దోచిపెట్టడమేనని ఎద్దేవా చేశారు కార్మిక సంక్షేమాన్ని విస్మరిస్తే ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు వెంటనే పని గంటల పెంపును ఉపసమరించుకోవాలని నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు .జూలై 9 న జరిగే దేశవ్యాప్త కార్మిక సమ్మెను అన్ని వర్గాల ప్రజలు జయప్రదం చేయాలని ఆటో కార్మికులందరూ సమ్మెలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఐ ఎఫ్ టి యు ఆటో యూనియన్ నాయకులు రావుల వీరేష్, జానపాటి శంకర్, కత్తుల చందు, సిహెచ్ వెంకటరమణ ,నాంపల్లి శంకర్ ,అల్లి శంకర్, రాజు, అంజి ,ముత్తు స్వామి, దాసరి నరసింహ, గోవింద అశోక్ ,అల్లి శంకర్, బి టి ఎస్ నరసింహ, అయోధ్య తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

ఖాజాగూడా జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలకు ఖాజాగూడా జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలకు
-బల్లలు, ఆఫీసు టేబుల్ అందజేసిన..కోమరగౌని వెంకటేష్ గౌడ్, అఖిల్ గౌడ్ ప్రభుత్వం పాఠశాలను బలోపేతం చేస్తాం..కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి శేరిలింగంపల్లి, (లోకల్ గైడ్ ప్రతినిధి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని...
ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలి
పార్టీలో ఎదగడానికి యువజన కాంగ్రెస్ మూల స్తంభం.
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలి
వైయస్సార్ సేవలు మరువలేనివి.
కేసీఆర్ లేఖ రాస్తే అసెంబ్లీ పెడతాం -పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి
శిక్షణలో నేర్చుకున్న అంశాలను గ్రామాల్లో అమలు చేయాలి