ఎస్.ఎస్. రాజమౌళి సినిమాల బడ్జెట్, కలెక్షన్ల రికార్డులు
"స్టూడెంట్ నెం.1 నుండి ఆర్ఆర్ఆర్ వరకు – రాజమౌళి సినీ ప్రయాణం"
ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వం వహించిన 12 సినిమాల బడ్జెట్, బాక్సాఫీస్ కలెక్షన్లు అద్భుతంగా నిలిచాయి. స్టూడెంట్ నెం.1 నుంచి ఆర్ఆర్ఆర్ వరకు ప్రతి చిత్రం హిట్, బ్లాక్‌బస్టర్, ఇండస్ట్రీ హిట్‌ల జాబితాలో చోటు చేసుకుంది. రాబోయే SSMB29 కోసం సుమారు ₹1000 కోట్ల భారీ బడ్జెట్ ఖర్చు కానుంది.
భారత సినీ పరిశ్రమలో విజువల్ వండర్‌లతో కొత్త మైలురాళ్లు సృష్టించిన దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కెరీర్‌లో 12 చిత్రాలు బాక్సాఫీస్‌ను కుదిపేశాయి. వీటి బడ్జెట్, కలెక్షన్ల వివరాలు ఇలా ఉన్నాయి.
స్టూడెంట్ నంబర్ 1 (2001) – బడ్జెట్ ₹2.5 కోట్లు, కలెక్షన్లు ₹10 కోట్లు. సూపర్ హిట్.
సింహాద్రి (2003) – బడ్జెట్ ₹12 కోట్లు, కలెక్షన్లు ₹50 కోట్లు. ఆల్‌టైమ్ బ్లాక్‌బస్టర్.
సై (2004) – బడ్జెట్ ₹15 కోట్లు, కలెక్షన్లు ₹30 కోట్లు. సూపర్ హిట్.
ఛత్రపతి (2005) – బడ్జెట్ ₹15 కోట్లు, కలెక్షన్లు ₹30 కోట్లు. సూపర్ హిట్.
విక్రమార్కుడు (2006) – బడ్జెట్ ₹14 కోట్లు, కలెక్షన్లు ₹50 కోట్లు. బ్లాక్‌బస్టర్.
యమదొంగ (2007) – బడ్జెట్ ₹30 కోట్లు, కలెక్షన్లు ₹45 కోట్లు. సూపర్ హిట్.
మగధీర (2009) – బడ్జెట్ ₹35 కోట్లు, కలెక్షన్లు ₹150 కోట్లు. ఇండస్ట్రీ హిట్.
మర్యాద రామన్న (2010) – బడ్జెట్ ₹12 కోట్లు, కలెక్షన్లు ₹57 కోట్లు. సూపర్ హిట్.
ఈగ (2012) – బడ్జెట్ ₹30 కోట్లు, కలెక్షన్లు ₹130 కోట్లు. బ్లాక్‌బస్టర్ హిట్.
బాహుబలి: ది బిగినింగ్ (2015) – బడ్జెట్ ₹180 కోట్లు, కలెక్షన్లు ₹650 కోట్లు. ఆల్‌టైమ్ బ్లాక్‌బస్టర్.
బాహుబలి: ది కన్‌క్లూజన్ (2017) – బడ్జెట్ ₹250 కోట్లు, కలెక్షన్లు ₹1800 కోట్లకు పైగా. ఇండియా ఇండస్ట్రీ హిట్.
ఆర్‌ఆర్‌ఆర్ (2022) – బడ్జెట్ ₹550 కోట్లు, కలెక్షన్లు ₹1200 కోట్లకు పైగా. బ్లాక్‌బస్టర్.
అంతేకాదు, ఆయన తదుపరి చిత్రం SSMB29 దాదాపు ₹1000 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందనుందని సమాచారం.
About The Author
