కాంగ్రెస్ ప్రజా పాలన ప్రభుత్వం పేదల పక్షపాతి...
అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు...
మంచిర్యాల జిల్లా (లోకల్ గైడ్) బెల్లంపల్లి నియోజకవర్గంలోని నెన్నెల మండల కేంద్రానికి చెందిన సుమారు 621మంది లబ్ధిదారులకు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ప్రభుత్వం మంజూరు చేసిన నూతన రేషన్ కార్డులు అందజేశారు.నెన్నెల మండల కేంద్రంలోని రైతు వేదికలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆర్ డి ఓ,తాహసిల్దార్ స్థానిక నాయకులతో కలిసి ఆయన రేషన్ కార్డులు పంపిణీ చేశారు.మొదటి విడత లక్ష రూపాయలు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతు ప్రభుత్వం ప్రవేశపెట్టే ఎలాంటి సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందాలన్నా రేషన్ కార్డు ప్రామాణికం అని, అలాంటి రేషన్ కార్డులు గత10ఏళ్లలో నూతన రేషన్ కార్డులు మంజూరు చేయకుండా గత బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను ఇబ్బందులు పెట్టిందని ఆయన అన్నారు.కానీ ప్రజాపాలన ప్రభుత్వంలో ఇచ్చిన మాట ప్రకారం రేషన్ కార్డు ఇవ్వడమే కాకుండా రేషన్ ద్వారా సన్న బియ్యం ఇస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం గృహ హక్కును సాధించేందుకు కట్టుబడి పని చేస్తోందని,నిరుపేదల కలలు అన్నిటిని సాకారం చేయడమే ఇందిరమ్మ ఇండ్ల యోజన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.అర్హులందరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం అని ఆయన అన్నారు.ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తు ప్రజా సంక్షేమం దిశగా పాలన సాగిస్తున్నామని అన్నారు.అర్హులైన నిరుపేదలకు,ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇండ్లు,మహిళలకి ఉచిత బస్ ప్రయాణం,200 యూనిట్లు ఉచిత విద్యుత్,ప్రజల సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం మరిన్ని పథకాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టి ప్రజలకి ఎల్లవేళల అందుబాటులో ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి బొమ్మన హరీష్ గౌడ్,లబ్ధిదారులు స్థానిక నాయకులు,అధికారులు పాల్గొన్నారు.
About The Author
Related Posts
