వివాదాస్పదంగా మారిన పోడు భూముల సమస్య

ట్రెంచ్ కొట్టిన అటవీశాఖ – పోలీసుల భారీ బందోబస్తు మధ్య గిరిజనుల ఆగ్రహం, పోడు సాగుదారులకు న్యాయం చేయాలని డిమాండ్

వివాదాస్పదంగా మారిన పోడు భూముల సమస్య

ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం మాణిక్యారం ఎర్రబోడు ప్రాంతంలోని పోడు భూముల్లో అటవీశాఖ అధికారులు ట్రెంచ్ (తీలలు) కొట్టడంతో గిరిజనుల్లో తీవ్ర ఆగ్రహం వెల్లువెత్తింది. పోలీసులు భారీ బందోబస్తుతో పనిచేస్తుండగా, పోడు సాగుదారులు తాము సాగుచేసే భూములపై అక్రమంగా చర్యలు తీసుకుంటున్నారని మండిపడుతున్నారు.

 
 మాణిక్యారం ఎర్రబోడు ప్లాంటేషన్ లో ట్రెంచ్ కొట్టిన వైనం
- పోలీసుల భారీ బందోబస్తు

- లోకల్ గైడ్ /కారేపల్లి మండలం మాణిక్యారం ఎర్రబోడు ప్లాంటేషన్ భూమిలో ఖమ్మం సబ్ డివిజన్ పరిధిలో పోలీసులు బందోబస్తు లో ట్రెంచ్ కొట్టడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోడు సాగుదారులు అందుబాటులో లేకపోవడంతో అటవీశాఖ అధికారులు చేసిన పనికి గిరిజనులు మండిపడుతున్నారు. పోడు భూములు జీవనాధారంగా ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న పోడు సాగుదారులకు ప్రభుత్వం ప్రత్యన్మయం చూపిస్తామని చెబుతూ అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు ఆ సంగతే మరిచి ఎటువంటి న్యాయం చేయకుండా పోడు భూముల్లో ట్రెంచ్ కొట్టడంతో.. గత కేసీఆర్ ప్రభుత్వం చేసిన బాటలోనే నడుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోడు సాగుదారులకు న్యాయం చేస్తామని కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి తెస్తే పదేళ్లు పాలన చేసిన కేసీఆర్ ప్రభుత్వం చేసిందేమీ లేదని, అందుకే ఓడించి కాంగ్రెస్ ప్రభుత్వం గెలిపిస్తే.. ప్రజా పాలన అని చెబుతూ... నేటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అదే బాటలో పయనించడం విచారంగా ఉందని, ఇప్పటికైనా ఎర్రబోడు పోడు సాగుదారుల కు న్యాయం చేయకపోతే... ఆందోళనలు ఉదృతం చేస్తామని పొడుసాగుదారులు, గిరిజనులు హెచ్చరిస్తున్నారు.
Ask ChatGPT
Tags:

About The Author

Latest News

ప్రణాళిక బద్ధంగా ఓదెల మల్లన్న ఆలయ అభివృద్ధికి కృషి... ప్రణాళిక బద్ధంగా ఓదెల మల్లన్న ఆలయ అభివృద్ధికి కృషి...
పెద్దపల్లి ఓదెల జూలై,31 (లోకల్ గైడ్); తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ ఓదెల మండల కేంద్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయానికి తాజాగా...
ప్రశాంత వాతావరణంలో జీవించండి: రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు.
విద్యార్థుల వినతిపై తక్షణమే స్పందించిన కలెక్టర్... 
పరిగిలో రోడ్డు ప్రమాదం: ఒకరి దుర్మరణం
ప్రమాదం తప్పిన  ఆర్టీసీ బస్సు 
పదవీ విరమణ చేస్తున్న అధికారులకు ఘనంగా వీడ్కోలు
ఈ రోజు మీ రాశికి అదృష్టమే అదృష్టం