పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సంచాలకులు నవీన్ నికోలస్ కు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని వినతి.

ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం

పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సంచాలకులు నవీన్ నికోలస్ కు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని వినతి.

నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి .(లోకల్ గైడ్).

పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు సంచాలకులు  నవీన్ నికోలస్ నీ ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం నాయకుడు కలిసి వినతి పత్రం సమర్పించారు.
 ఎస్సీఎస్టీ ఉపాధ్యాయులకు ప్రమోషన్లలో రిజర్వేషన్ అమలు చేసే సందర్భంలో జి.ఓ.నెం.2 లోని అడక్వసీని కారణంగా చూపుతూ,ఓపెన్ లో ప్రమోషన్ వచ్చిన వారిని రిజర్వేషన్ లో కలుపుతూ మొత్తంగా ఎస్ . సి-15%, ఎస్. టి-10% పరిమితం చేస్తూ అడక్వసీ పూర్తి అయినదని తదుపరి ఎస్సీఎస్టీల రోస్టర్ లను జనరల్ వారికి కేటాయించటం వల్ల ఎస్సీఎస్టీ ఉపాధ్యాయులకు తీవ్ర అన్యాయం జరుగుతునదని వివరించారు. సరిచేసి న్యాయం చేయాలని కోరగా పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని సానుకూలంగా స్పందించడంతో పాటు ఎస్సీఎస్టీ ఉపాధ్యాయుల ఉన్నత విద్యకు సంబంధించి స్కూల్ అసిస్టెంట్ లకు కూడా పీజీ/ఎం ఈ డి చేసుకోనుటకు అడ్డంకిగా ఉన్న మెమో నెం.26559 ను రద్దుపరిచి, జి.ఓ.342 ను ఎలాంటి షరతులు లేకుండా ఓ.డి.సౌకర్యం కల్పించాలని  కోరారు. ఈ
కార్యక్రమంలో పాల్గొన్న సంఘం రాష్ట్ర అధ్యక్షులు  తొంట సత్యనారాయణ,ప్రధాన కార్యదర్శి  పెంట అంజయ్య,వర్కింగ్ ప్రెసిడెంట్ లు సూర్యదేవర దానయ్య, చాగంటి ప్రభాకర్, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు మోతె సాయన్న, అసోసియేట్ అధ్యక్షులు  బి నర్సింహ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

ప్రణాళిక బద్ధంగా ఓదెల మల్లన్న ఆలయ అభివృద్ధికి కృషి... ప్రణాళిక బద్ధంగా ఓదెల మల్లన్న ఆలయ అభివృద్ధికి కృషి...
పెద్దపల్లి ఓదెల జూలై,31 (లోకల్ గైడ్); తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ ఓదెల మండల కేంద్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయానికి తాజాగా...
ప్రశాంత వాతావరణంలో జీవించండి: రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు.
విద్యార్థుల వినతిపై తక్షణమే స్పందించిన కలెక్టర్... 
పరిగిలో రోడ్డు ప్రమాదం: ఒకరి దుర్మరణం
ప్రమాదం తప్పిన  ఆర్టీసీ బస్సు 
పదవీ విరమణ చేస్తున్న అధికారులకు ఘనంగా వీడ్కోలు
ఈ రోజు మీ రాశికి అదృష్టమే అదృష్టం