ఘనంగా సుభాష్ చంద్రబోస్ జన్మదిన వేడుకలు
పాల్గొన్న..బేరి రామచందర్ యాదవ్, ఖాసీం
By Ram Reddy
On
శేరిలింగంపల్లి, (లోకల్ గైడ్ ప్రతినిధి):
శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని గచ్చిబౌలి డివిజన్ నేతాజీనగర్‌లో నేతాజీసుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. నేతాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి, కొబ్బరికాయలు కొట్టి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బేరి రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ.. “సుభాష్ చంద్రబోస్ స్వాతంత్ర్య సమరయోధుల లో అగ్రగణ్యులు. ఆయన త్యాగం, పోరాటం వలనే ఆజాద్ హింద్ సైన్యం రూపుదిద్దుకుంది. బ్రతికి ఉండి ఉంటే ఆయనే దేశ ప్రధాని అయ్యేవారు” అన్నారు. ఈ కార్యక్రమంలో గుల్మోహర్ పార్క్ కాలనీ అధక్షులు ఖాసిం, బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు ఆర్కే సాయన్న ముదిరాజ్, నేతాజీ నగర్ కాలనీ ఉపాధ్యక్షులు నరసింహ యాదవ్, కాలనీ పెద్దలు, మహిళలు, యువత, తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author

Latest News
19 Aug 2025 20:08:16
వినాయక విగ్రహాలుఏర్పాటుకు అనుమతి తప్పనిసరి విగ్రహాల ఏర్పాటు ఆన్లైన్ ద్వారా సమాచారం అందించాలి . మోమిన్ పెట్ సర్కిల్ఇ న్స్పెక్టర్ బి.వెంకట్