సురవరం ముత్తిపట్ల సంతాపం వ్యక్తం చేసిన గుత్తా సుఖేందర్ రెడ్డి.
తెలంగాణ ప్రజలకు తీరని లోటు
నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి .(లోకల్ గైడ్)
భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ నాయకులు సురవరం సుధాకర్ రెడ్డి మరణంపట్ల తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సురవరం సుధాకర్ రెడ్డి గారి మరణం తెలంగాణ ప్రజలకు తీరని లోటని ఆయన తెలిపారు.
విద్యార్థి దశ నుంచి కమ్యూనిస్ట్ భావాలను పునికిపుచ్చుకొని జీవితాంతం నమ్మిన సిద్ధాంతం కోసం పని చేసిన గొప్ప నేత సురవరం ఆని వివరించారు. తెలంగాణ కు చెందిన సురవరం సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పని చేయడం మనకు గర్వకారణమన్నారు
రెండు సార్లు నల్గొండ ఎంపీగా పని చేసిన సురవరం సుధాకర్ రెడ్డి ప్రజల పక్షపతిగా పేదల అభ్యున్నతి కోసం పని చేసారని , ఒక మంచి వామపక్ష భావజాలం ఉన్న నాయకుడిని తెలంగాణ కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తు,
వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని గుత్తా సుఖేందర్ రెడ్డి తెలియజేశారు.