సిద్దిపేట జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్ తెలంగాణ)
ఏప్రిల్ 13: సోమవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం (IDOC) సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదుదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా అర్జీదారులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ తెలిపారు.భూ సంబంధిత, హౌసింగ్, ఆసరా పింఛన్లు మరియు ఇతర సమస్యల పరిష్కారం కోసం జిల్లా నలుమూలల నుంచి వచ్చిన మొత్తం 235 అర్జీలను స్వీకరించారు. బాధితులకు సత్వరమే న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.అర్జిదారులు మళ్లీ మళ్లీ కార్యాలయాల చుట్టూ తిరగకుండా సకాలంలో సమస్యలను పరిష్కరించాలని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో డీఆర్వో నాగరాజమ్మ, ఏఓ రాజ్‌కుమార్, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.