అర్హులందరికీ ప్రభుత్వ పథకాల అమలు
దొరేపల్లి గ్రామ సభలో కలెక్టర్ ప్రతీక్ జైన్.
నారాయణపేట ఏప్రిల్ 2:
అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను లబ్ది చేకూరుస్తామని, ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారంటీ పథకాలకు ఇంకా ఎవరైనా అర్హులు ఉంటే దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం అమలులో భాగంగా జిల్లాలోని మద్దూరు మండలం దొరేపల్లి గ్రామంలో గురువారం ఏర్పాటుచేసిన గ్రామసభ కు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతకుముందు గ్రామస భలో ముఖ్యమంత్రి సందేశం వినిపించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ చిన్న పిల్లాడి నుంచి వృద్ధుల వరకు ప్రభుత్వం అన్ని సేవలను అందిస్తోందన్నారు. ఉచిత బస్సు ప్రయాణం విషయాన్ని వస్తే.. గతంతో పోలిస్తే మహిళలు ప్రయాణాలు పెరిగాయని తెలిపారు. రైతు భరోసా కింద ఎకరా కు 6 వేల చొప్పున ఇస్తోందన్నారు. భూభారతి పోర్టల్ తో భూ వివాదాలు తగ్గుతున్నా యన్నారు. జిల్లాలో ఒక్కటే రెవెన్యూ డివిజన్ ఉంద ని,రెవెన్యూ సమస్యలను పరిష్కరిస్థామన్నారు. అలాగే మద్దూరు మండలం కడ కింద ఉందని, ఈ మండ లంలోని ప్రతీ గ్రామానికి రెండు హైమాస్ట్ లైట్లను ఇవ్వడం జరిగిందన్నారు. ఏప్రిల్ నుంచి మళ్ళీ కొత్త ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అవుతాయని ఆయన చెప్పారు. 18 సంవత్సరాలు దాటిన మహిళలందరూ సంఘాల్లో చేరాలని, అలాగే 15 నుంచి18 సంవత్సరాల వయసు కలిగిన బాలికలు కూడా ఒక సంఘాన్ని ఏర్పా టు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. మహిళలకు 2 నెలలకు ఒకసారి వడ్డీ లేని రుణాలు ఇవ్వడం జరుగు తుందన్నారు. సంఘంలోని మహిళలకు ఇన్సూరెన్స్ కూడా ఉంటుందని, ఏదైనా అనుకోని సంఘటన, లేదా ఆకస్మిక మరణం పొందిన మహిళకు 10 లక్షల ఇన్సూ రెన్స్ వర్తిస్తుందని ఆయన తెలిపారు. ప్రస్తుతం ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు తప్ప నిసరి అని, కేంద్ర, రాష్ట్ర సంక్షేమ పథకాలు ఆధార్ తోనే ముడిపడి ఉన్నాయ న్నారు. త్వరలో ప్రారంభమ య్యే ఎస్ ఐ ఆర్ ప్రక్రియ కు ఆధార్ అవసరం అన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేస్తున పథకాలతో పాటు మరో రెండు పథకాలను ప్రారంభించనుందని కలెక్టర్ వెల్లడించారు. జూన్ 2 నుంచి ప్రారంభించే ఇంది రమ్మ జీవిత బీమా పథకం, ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకు అల్పాహార కార్యక్ర మంతో పాటు, పాలు, రాగి జావా అందించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు వివరించాలని అన్నారు. ప్రజల నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్ విస్తృతంగా ప్రచారం జరిగేలా చూడాలని అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మార్చ్ 6 నుంచి 15 వరకు నిర్వహించిన పెండింగ్ ఫైల్స్ సత్వర పరిష్కారం, పారిశుద్ధ్య నిర్వహణ కార్య క్రమానికి మంచి స్పందన వచ్చిందని, అదే స్పూర్తితో గ్రామ, వార్డు సభలను విజ యవంతం గా నిర్వహించా లని తెలిపారు.ప్రతి జిల్లాలో గ్రామ సభలు ఎలా జరుగు తున్నాయి అనే అంశంపై రిపోర్టు అందించాలని కలెక్టర్ లను ఆదేశించారు. గ్రామ సభలలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనేలా చూడాలని, స్థాని క ప్రజా ప్రతినిధులు తప్పని సరిగా గ్రామసభలో ఉండాల ని అన్నారు.గ్రామ సభలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ, వివిధ పథకాల లబ్ధిదారుల వివరా లు తెలియ జేయాలని అన్నారు. గ్రామంలో ఉన్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ప్రజలకు వివరించాలని అన్నారు. గ్రామసభ తర హాలో మున్సిపాలిటీ వార్డు లో సైతం సభలు నిర్వహిం చేందుకు అవసరమైన చర్య లు తీసుకోవాలని కలెక్టర్ లకు సీఎస్ సూచించారు. ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు ప్రస్తుత బడ్జెట్ లో ప్రతిపాదించిన వివిధ పథకా లకు సంబంధించిన మార్గద ర్శకాలను కూడా గ్రామ, వార్డు సభలలో ప్రజలకు వివరించాలని అధికారులకు సూచించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ మున్సిపాలి టీలో ప్రజలందరికీ ప్రజాపా లన ప్రగతి ప్రణాళిక కార్య క్రమం తెలిసే విధంగా వార్డు సభలు నిర్వహించాలని అన్నారు. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలలో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళి క 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఏప్రిల్ 2 తేదీన గ్రామ, వార్డు సభలు నిర్వహించాలని తెలిపారు. గ్రామ, వార్డు సభలు నిర్బ హణపై ప్రభుత్వం జారీ చేసిన షెడ్యూల్, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారం, జిల్లాలోని ప్రతి గ్రామ పంచా యతీలో గ్రామ సభలు సమర్థవంతంగా నిర్వహిం చేందుకు ప్రత్యేక అధికారు లను నియమించినట్లు తెలిపారు. గ్రామ సభల ద్వారా ప్రజల సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించడం ప్రధాన ఉద్దేశ్యమని కలెక్టర్ పేర్కొ న్నారు. ప్రజల భాగస్వా మ్యంతో గ్రామ అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడం కోసం ఈ కార్య క్రమం చేపట్టినట్లు తెలిపారు. నియమితులైన ప్రత్యేక అధి కారులు తమకు కేటాయిం చిన గ్రామ పంచాయతీలలో గ్రామ సభలను తప్పనిసరిగా నిర్వహించి, నివేదికలను సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు.జిల్లాలోని ప్రజలందరూ గ్రామ సభలకు హాజరై తమ అభిప్రాయాలు, సమస్యలను వెల్లడించి, గ్రామాభివృద్ధిలో భాగస్వా ములు కావాలని కోరారు. జిల్లాలో పారదర్శకంగా ప్రభు త్వ పథకాలను అమలు చేయడం జరుగుతుందని, ఇంకా ఎవరైనా అర్హులు ఉంటే దరఖాస్తు చేసుకోవా లని ఆయన తెలిపారు. అయితే రోడ్డు విస్తరణలో భాగంగా గ్రామంలో కొంత మంది ఇండ్లు కోల్పోతున్నా రని, వారికి కొత్తగా ఇందిర మ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వా లని బాధితులు కలెక్టర్ ను కోరారు. కాగా అంతకు ముందు ప్రభుత్వం చేపట్టిన ఆరు గ్యారంటీలు వివిధ సంక్షేమ పథకాల గురించి గ్రామసభలో ప్రజలకు వివ రంగా అవగాహన కల్పించా రు. గ్రామ సభలో అన్ని శాఖ ల అధికారులు తమ తమ శాఖల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రగతి నివేదిక లు,మంజూరైన నిధులు, లబ్ధిదారుల వివరాలను చదివి వినిపించారు, తద్వా రా ప్రజలకు పూర్తి సమాచా రం అందించారు.ఈ కార్యక్ర మంలో జిల్లా రెవెన్యూ అద నపు కలెక్టర్ శ్రీను, డిపివో సుధాకర్ రెడ్డి, తహసిల్దార్ మహేష్, ఎంపీడీవో, అన్ని శాఖల మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.
ఫోటో రైట్ అప్:12.గ్రామ సభ లో మాట్లాడుతున్న కలెక్టర్
--------------------------------------
