డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతిని జయప్రదం చేయండి -

 డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్

డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతిని జయప్రదం చేయండి -

జయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ దాసరి రమేష్.                

      రాజేంద్రనగర్,

నేడు ఆరాంఘార్ చౌరస్తా లో జరిగే డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమానికి  ప్రజాప్రతినిధులు, ప్రజాస్వామ్యవాదులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, దళిత బహుజన సంఘాల నాయకులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఉత్సవాల కమిటీ చైర్మన్ దాసరి రమేష్ కోరారు. బాబు జగ్జీవన్ రామ్ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల కమిటీ సమావేశాన్ని శనివారం ప్రేమావతి పేటలోని కమ్యూనిటీ హాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏడాది మాదిరిగా నిర్వహించే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. అరాంఘర్ చౌరస్తాలో ఆదివారం (ఏప్రిల్ 5వ తేదీ న నిర్వహించే డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదరం రాజనర్సింహ, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, చెవిలో ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రాజేంద్రనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే టి ప్రకాష్ గౌడ్, ఎం ఆర్ పి ఎస్ జాతీయ అధ్యక్షులు  మందకృష్ణ మాదిగ, ప్రభుత్వ చిప్ విఫ్ పట్నం మహేందర్ రెడ్డి, మహేశ్వరం ఎమ్మెల్యే పి సబితా ఇంద్రారెడ్డి, దళిత సేన అధ్యక్షులు జేబీ రాజు, మాజీ శాసనమండలి చైర్మన్ కే స్వామి గౌడ్, మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి ఇతర ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ శాఖల  అధికారులు పాల్గొంటున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఆయా ప్రజా ప్రతినిధులతో పాటు  వివిధ ప్రభుత్వ విభాగాల అధికారులకు, స్థానిక ప్రజా ప్రతినిధులకు, ప్రముఖులకు ఆహ్వాన పత్రికలను అందజేశామన్నారు. ఈ సమావేశంలో వైస్ చైర్మన్ ఎన్ నరసింహ, ప్రధాన కార్యదర్శి మంగళవారం శ్రీనివాస్, కోశాధికారి పలుగు చెరువు మహేందర్, ఉప కోశాధికారి ఎడ్లకాడి చంద్రశేఖర్, జయంతి ఉత్సవాలు వ్యవస్థాపక అధ్యక్షులు పోయిల జీవన్దాస్, ఎం ఆర్ పి ఎస్ జాతీయ నాయకులు వనం నరసింహ మాదిగ, ఉత్సవ కమిటీ సభ్యులు పంపాల రాజు, ఎడ్ల కాడి సూర్యం, గుడిసె యాదయ్య, లలిత్ వర్రీ, కే హరినాథ్, గొంతు సురేష్, మంత్రి చంద్రశేఖర్, పచ్చ నర్సింగ్ రావు, గోల్కొండ రాజు, కే నర్సింగ్ రావు  తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ కూటమికి మహిళలే బుద్ధి చెబుతారు బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ కూటమికి మహిళలే బుద్ధి చెబుతారు
నారాయణపేట ఏప్రిల్ 17: కేంద్ర ప్రభుత్వం దశాబ్దాల కాలంగా మహిళలు ఎదురుచూస్తున్న మహిళా బిల్లును పార్లమెంట్ లో ప్రవేశ పెడితే ఆబిల్లు ను క్రూరంగా కాంగ్రెస్ కూటమి...
ఎండాకాలం జాగ్రత్తలు తెలియజేయాలి.
రోడ్డు భద్రత నియమాలు పాటిస్తేనే ప్రమాదాల నివారణ. రాష్ట్ర రైల్వే, రోడ్డు భద్రత ఐజీపీ రమేష్ నాయుడు ఐపీఎస్ సాధ్యం.
విద్యుత్ వినియోగదారులకు కొత్త సర్వీసుల మంజూరు
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి .....జిల్లా కలెక్టర్ అంకిత్
అన్నారం లో అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం
ప్రభుత్వ తీరుపై ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల గర్జన!