అరుదైన గుండె సిండ్రోమ్‌కు విజయవంతమైన చికిత్స

మెడికవర్ హాస్పిటల్స్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సంతోష్ మోదాని....వెల్లడి

అరుదైన గుండె సిండ్రోమ్‌కు విజయవంతమైన చికిత్స

హనుమకొండ జిల్లా ప్రతినిధి ఏప్రిల్03(లోకల్ గైడ్

వరంగల్,
గుండె వేగంగా కొట్టుకోవడం సమస్యతో బాధపడుతున్న 40 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స అందించామని వరంగల్ మెడికవర్ హాస్పిటల్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సంతోష్ మోదాని శుక్రవారం విలేఖరుల సమావేశంలో తెలిపారు. గత మూడు నెలలుగా రోగికి తరచుగా గుండె వేగం ఒక్కసారిగా పెరిగి నిమిషానికి 250 బీట్‌ల వరకు నమోదవుతూ ఉండేదని, వైద్య పరీక్షల్లో ఆమెకు సుప్రావెంట్రిక్యులర్ టాకీకార్డియా (ఎస్ వి టి) సమస్య ఉన్నట్లు గుర్తించామని, అనంతరం నిర్వహించిన ఈ సి జీ పరీక్షలో గుండె విద్యుత్ ప్రసరణ వ్యవస్థలో అదనపు మార్గం ఉన్నట్లు తేలడంతో,(గుండె విద్యుత్ ప్రవాహంలో సమస్య) సిండ్రోమ్ గా నిర్ధారించామని పేర్కొన్నారు. 
కార్డియాలజీ నిపుణులు ముందుగా ఎలెక్ట్రోఫిజియాలజీ స్టడీ (ఈ పి ఎస్) ద్వారా గుండెలోని అసాధారణ విద్యుత్ మార్గాన్ని ఖచ్చితంగా గుర్తించి, అనంతరం రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ద్వారా ఆ మార్గాన్ని తొలగించారు. ఈ కేసులో గుండె ఎడమ వైపున ఉన్న అదనపు మార్గాన్ని చేరుకోవాల్సి రావడంతో ట్రాన్స్‌సెప్టల్ పంక్చర్ అనే ప్రత్యేక విధానాన్ని ఉపయోగించి చికిత్సను విజయవంతంగా పూర్తి చేశా మన్నారు. ఈ క్లిష్టమైన ప్రక్రియను ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సంతోష్ మోదాని విజయవంతంగా నిర్వహించారని హాస్పిటల్ మేనేజ్మెంట్ వివరించారు. 
చికిత్స అనంతరం రోగి పూర్తిగా కోలుకుని ప్రస్తుతం ఆరోగ్యంగా సాధారణ జీవితం గడుపుతున్నారని తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ సంతోష్ మోదాని మాట్లాడుతూ గుండె రిధమ్ సమస్యలను సమయానికి గుర్తించి సరైన చికిత్స అందిస్తే తీవ్రమైన సమస్యలను నివారించవచ్చని సూచించారు.

Tags:

About The Author

Latest News

_సొంత ఖర్చులతో చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయం_ _సొంత ఖర్చులతో చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయం_
    -  వైరా:లోకల్ గైడ్ :గ్రామ వాసి షేక్ లతీఫ్ సొంత ఖర్చులతో ఏర్పాటు చేసిన చలివేంద్రం ప్రారంభోత్సవం వైరా ఎస్సై పుష్పాల రామారావు  చేతుల మీదుగా
అరుదైన గుండె సిండ్రోమ్‌కు విజయవంతమైన చికిత్స
దొడ్డి కొమురయ్య జీవిత ఆశయాలను ప్రతి ఒక్కరు స్ఫూర్తిగా
ఫ్రైడే డ్రై డే కార్యక్రమంతో దోమల వ్యాధులపై అవగాహన
రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కు శుభాకాంక్షలు
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు
కొండాపూర్, డివిజన్ నుంచి బలరాం యాదవ్ పోటీకి సన్నాహాలు