అంబేద్కర్ ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలి
డిఫెన్సె కౌన్సెల్ కే . లక్ష్మి పతి గౌడ్
By Ram Reddy
On
నారాయణపేట ఏప్రిల్ 13:
తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశాలకు అనుగుణంగా బి.ఆర్.అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని సోమవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో వుమన్ డెవలప్మెంట్ సెంటర్ లో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. బి.ఆర్.అంబేద్కర్ అమూల్యమైన సూక్తులతో మహనీయుడిని స్మరించుకుందాం అంటూ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి సదస్సును ప్రారంభించారు .యావత్ భారతావనికి అందించిన విలువైన సేవలను స్మరించుకుంటు అంబేద్కర్ చెప్పిన విలువైన సూక్తులనూ తెలియపరిచారు. భారతదేశ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులలో వారిలో ఒక ప్రసిద్ధ పేరు భీమ్‌రావ్ రామ్‌జీ అంబేద్కర్ ఒకరని , ఈ గొప్ప భారతీయ దేశభక్తుని పేరు చరిత్ర పుటలలో ప్రతి భారతీయుని హృదయంలో ఎల్లప్పుడూ సజీవంగా ఉంటుందని తెలిపారు . స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి కేంద్ర న్యాయ శాఖ మంత్రిగ పని చేసి లిఖిత రాజ్యాంగ రూప కర్తగా, రాజకీయవేత్త, న్యాయనిపుణుడు, ఆర్థికవేత్త,సంఘ సంస్కర్త. ఇంకా, దళిత బౌద్ధ ఉద్యమానికి చోదక శక్తి అంబేద్కర్ అని, అంటరానితనాన్ని వ్యతిరేకిస్తూ దళితులు, మహిళలు, కార్మికుల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన యోధుడు అంబేద్కర్ అని అతని ఆశయాలను మనమందరం పాటిస్తూ ముందుకు సాగాలని కోరారు. ఈ సదస్సులో హాజరైన ప్రజలకు బాల్యవివాహాలు, బాలకార్మిక చట్టాలు, వరకట్న వేదింపులు, పోక్సో చట్టాలు, ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు, లోక్ అదాలత్ లో ఉచిత న్యాయం, ఉచిత అడ్వకేట్ పొందడం, పబ్లిక్ రిలేవెంట్ ఇంటిమేషన్ రైట్స్ మరియు సమానత్యము హక్కు, చట్టాల గురించి వివరించారు . ఈ కార్యక్రమంలో పారా లీగల్ వాలంటీర్స్ హాజమ్మ, వుమన్ డెవలప్మెంట్ సెంటర్ టీచర్ మహాదేవి , వార్డు కౌన్సిలర్ సత్య రఘుపాల్ రెడ్డి, వుమన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నరసింహ , వార్డు సభ్యులు పాల్గొన్నారు.
ఫోటో రైట్ అప్:2.అంబేడ్కర్ కు నివాళి అర్పించిన డిఫెన్స్ కౌన్సెల్
______________________
Tags:
About The Author
Latest News
16 Apr 2026 20:20:20
నిలువునా రాలిపోతున్న ప్రాణాలకు దిక్కెవరు?
నిరంతరం ప్రమాదాలు జరిగే చోట నివారణ చర్యలు ఏవి?
