రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కు శుభాకాంక్షలు

*రామచంద్రపురం గ్రామ సర్పంచ్ రమేష్ గౌడ్

రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కు శుభాకాంక్షలు

జిల్లా ప్రతినిధి ఏప్రిల్03(లోకల్ గైడ్ న్యూస్)

తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం, ఎర్రబెల్లి స్వర్ణ ని వారి నివాసంలో సంగెం మండలం రామచంద్రపురం కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శాలువాతో ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, మహిళా సాధికారతకు ఎర్రబెల్లి స్వర్ణ నాయకత్వం రాష్ట్రానికి మరింత బలం చేకూరుస్తుందని, మహిళా కాంగ్రెస్‌ను గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. 
ఈ కార్యక్రమంలో రామచంద్రపురం గ్రామ సర్పంచ్ రమేష్ గౌడ్, గ్రామ పార్టీ అధ్యక్షులు ఈకె బిక్షపతి, మాజీ ఎంపీటీసీ చిదురాల కృష్ణంరాజు, మాజీ సర్పంచ్ సారయ్య, సీనియర్ నాయకులు నాగరబోయిన మల్లయ్య, వేల్పుల నర్సిల్లయ్య యూత్ కాంగ్రెస్ నాయకులు కత్తి నరేష్ గౌడ్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

_సొంత ఖర్చులతో చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయం_ _సొంత ఖర్చులతో చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయం_
    -  వైరా:లోకల్ గైడ్ :గ్రామ వాసి షేక్ లతీఫ్ సొంత ఖర్చులతో ఏర్పాటు చేసిన చలివేంద్రం ప్రారంభోత్సవం వైరా ఎస్సై పుష్పాల రామారావు  చేతుల మీదుగా
అరుదైన గుండె సిండ్రోమ్‌కు విజయవంతమైన చికిత్స
దొడ్డి కొమురయ్య జీవిత ఆశయాలను ప్రతి ఒక్కరు స్ఫూర్తిగా
ఫ్రైడే డ్రై డే కార్యక్రమంతో దోమల వ్యాధులపై అవగాహన
రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కు శుభాకాంక్షలు
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు
కొండాపూర్, డివిజన్ నుంచి బలరాం యాదవ్ పోటీకి సన్నాహాలు