బీసీ మహిళలకు సబ్ కోటా కేటాయించాలి

జాతీయ బీసీ సంక్షేమ సంఘం నేషనల్ కోఆర్డినేటర్ ఆకుల స్వామి వివేక్ పటేల్

బీసీ మహిళలకు సబ్ కోటా కేటాయించాలి

 
 -
 
 పెద్దపల్లి  ఏప్రిల్ 15 :(లోకల్ గైడ్)
 
మహిళా రిజర్వేషన్ బిల్లు
( నారీ శక్తి వందన్ అధినియం ) బిల్లులో బీసీ మహిళలకు న్యాయమైన వాటా దక్కాలంటే సబ్ కోటా తప్పనిసరిగా అమలు చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం నేషనల్ కోఆర్డినేటర్ ఆకుల స్వామి వివేక్ పటేల్ డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్  బిల్లులోని 33% కోటాలో 50% బీసీ మహిళలకు, అంటే మొత్తం సీట్లలో సుమారు 16.5% సబ్ కోటా కేటాయించాలని డిమాండ్ చేశారు. సబ్ కోటా అమలు చేయకపోతే అగ్రవర్ణ మహిళలు మాత్రమే లాభపడి, బీసీ మహిళలు మరింత వెనుకబడిపోయే ప్రమాదం ఉన్నదని వాపోయారు. తెలంగాణలో బీసీలు జనాభాలో  సుమారు 50-52% ఉన్నా చట్టసభల్లో బీసీ మహిళల ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉన్నదని, మహిళా రిజర్వేషన్ల బి అమలైనప్పుడు బీసీ మహిళలకు న్యాయమైన వాటా దక్కాలంటే సబ్ కోటా తప్పనిసరిగా అమలు చేయాలని తెలిపారు. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి, బడ్జెట్లో తగిన నిధులు కేటాయించాలని, జనగణనలో ఎసీ ఎస్టీల కుటుంబాల మాదిరిగానే బీసీ కుటుంబాలను కూడా లెక్కించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం నేషనల్ కోఆర్డినేటర్ ఆకుల స్వామి వివేక్ పటేల్ ఒక పత్రిక ప్రకటనలో  డిమాండ్ చేశారు.
Tags:

About The Author

Latest News