కాటేదాన్ డివిజన్‌లో ఘనంగా హనుమాన్ జయంతి

వేడుకలు: శోభయాత్రలో పాల్గొన్న బిఆర్ఎస్ కాటేదాన్ అధ్యక్షులు ఎస్. వెంకటేష్.

కాటేదాన్ డివిజన్‌లో ఘనంగా హనుమాన్ జయంతి

రాజేంద్ర నగర్, ( లోకల్ గైడ్ ):

రాజేంద్రనగర్ నియోజకవర్గం కాటేదాన్ డివిజన్‌లో  హనుమాన్ జయంతి వేడుకలు గురువారం ఎంతో వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా డివిజన్ పరిధిలోని ఆదర్శ నగర్ , సాయిబాబా నగర్ , బాబుల్ రెడ్డి నగర్  , కటేదాన్ , మైలర్ దేవ్ పల్లి బస్తీల్లోని శ్రీ హనుమాన్ దేవాలయాల్లో హనుమాన్ జయంతి వేడుకలు ఏంతో ఘనంగా నిర్వహించారు. ఈ జయంతి వేడుకల్లో కాటేదాన్ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎస్. వెంకటేష్  ముఖ్య అతిథిగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
 ఈ సందర్భంగా వెంకటేష్  మాట్లాడుతూ..భక్తిభావం మనుషుల్లో క్రమశిక్షణను, ఐక్యతను పెంచుతుందన్నారు. హనుమంతుడి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు
 నరేందర్ , శ్రీను , కొంపల్లి జగదీష్ , రామస్వామి , ఆనంద్ , బాల్ రాజ్ , అశోక్ , వెంకటేష్ , వెంకటరమణ , భగవాన్ దాస్ , జె సునీల్ , రిషి , బీంశప్ప , శేఖర్ , భూషణ్  తదితరులు పాల్గొన్నారు..

Tags:

About The Author

Latest News

దోమకొండలో 50 పడకల ఆసుపత్రి స్థలాన్ని పరిశీలించిన షబ్బీర్ అలీ దోమకొండలో 50 పడకల ఆసుపత్రి స్థలాన్ని పరిశీలించిన షబ్బీర్ అలీ
లోకల్ గైడ్ కామారెడ్డి జిల్లా  ఏప్రిల్ 2.కామారెడ్డి జిల్లా కేంద్రం లో దోమకొండ మండల కేంద్రంలో నూతనంగా మంజూరు చేయించిన 50 పడకల ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించి...
శేరిలింగంపల్లిలో ఘనంగా గణేష్ కుమార్ జన్మదిన వేడుకలు
17వ వార్డులో వార్డు సభ... 
కోనేరు అభివృద్ధికి పూజ 
కోటకొండలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక గ్రామ సభ 
మానవసేవే మాధవసేవ.. సమాజ సేవకుడు
కాటేదాన్ డివిజన్‌లో ఘనంగా హనుమాన్ జయంతి