ఏప్రిల్ 5న డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతోత్సవం నిర్వహణ
అందరూ ఆహ్వానితులే
By Ram Reddy
On
జిల్లా కలెక్టర్ ప్రావీణ్య
లోకల్ గైడ్/ సంగారెడ్డి:
సంగారెడ్డి జిల్లా కేంద్రంలో
డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి 118వ జయంతి సందర్భంగా ఈనెల 5వ తేదీ (ఆదివారం) ఉదయం 9.00 గంటలకు ఆర్ & బి కార్యాలయం పక్కన గల డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి విగ్రహానికి పుష్పమాలంకరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య శనివారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు.
అనంతరం, జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో సంగారెడ్డి పట్టణంలోని నటరాజ్ థియేటర్ పక్కన, కల్వకుంట రోడ్ వద్ద బహిరంగ సభ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ కుల సంఘాల నాయకులు, బడుగు బలహీన వర్గాల నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు.
Tags:
About The Author
Latest News
04 Apr 2026 20:48:16
హనుమకొండ జిల్లా ప్రతినిధి ఏప్రిల్04(లోకల్ గైడ్
హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో ఆరోగ్య వారోత్సవాల నిర్వహణపై సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్,ప్రజా...
