ఆఖరి ప్రయత్నం పై అభ్యర్థుల ఫోకస్.!
బస్తీ ఓటర్లకు మక్కా, చుక్క అంటూ ప్రచారాలు?
లోకల్ గైడ్/ తాండూర్:
మున్సిపల్ ఎన్నికలకు కేవలం ఒక్కరోజే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు తమ ఆఖరి ప్రయత్నాలపై పూర్తిగా దృష్టి సారించారు. ఇప్పటికే ప్రచారానికి గడువు ముగియడంతో, పోలింగ్‌కు ముందు చివరి అవకాశంగా ఓటర్లను ఆకట్టుకునేందుకు నాయకులు వ్యూహాలకు పదును పెట్టారు.
ఇంటి ఇంటి ప్రచారం, చిన్న సమావేశాలు, ముఖ్య కార్యకర్తలతో చర్చలు వంటి కార్యక్రమాలతో ఓటర్ల మద్దతు సంపాదించేందుకు అభ్యర్థులు శ్రమిస్తున్నారు. ముఖ్యంగా అనిశ్చిత ఓటర్లపై ఫోకస్ పెట్టిన అభ్యర్థులు, తమకు అనుకూలంగా వాతావరణాన్ని మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు.
మరోవైపు, పార్టీ శ్రేణులు కూడా పోలింగ్ రోజున ఓటింగ్ శాతం పెంచేందుకు కార్యాచరణ సిద్ధం చేశాయి. ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తరలించే ఏర్పాట్లు, బూత్ స్థాయి సమన్వయం వంటి అంశాలపై దృష్టి పెట్టారు. దీంతో ఎన్నికల పోరు చివరి దశలో మరింత ఉత్కంఠభరితంగా మారింది.
