( లోకల్ గైడ్ షాద్ నగర్)
కొందుర్గు మండలం లక్ష్మీదేవుని పల్లి గ్రామంలో ఘనంగా నిర్మాణం జరుగుతున్న గణపతి, అభయ ఆంజనేయ, శివాలయం, రామాలయం, నవగ్రహాల ప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా దేవాలయ అభివృద్ధికి విశేషంగా తోడ్పడుతూ దిలీప్ శర్మ గారు రూ.1,50,000 (ఒక లక్ష యాభై వేల రూపాయలు) మహా విరాళంగా అందజేశారు.గ్రామ ఆధ్యాత్మిక చరిత్రలో నిలిచిపోయే విధంగా అందించిన ఈ విరాళం ఆలయ నిర్మాణ పనులు, గోపుర నిర్మాణం, ధ్వజస్తంభ ప్రతిష్ఠ, మహోత్సవ ఏర్పాట్లకు ఎంతో బలాన్నిచ్చేలా ఉందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.“దేవాలయ సేవ అనేది దైవ సేవతో సమానం. ఇంత పెద్ద మొత్తంలో విరాళం అందించి గ్రామ ఆధ్యాత్మిక వికాసానికి చేయూతనివ్వడం అత్యంత ప్రశంసనీయం” అని గ్రామ పెద్దలు పేర్కొన్నారు.దిలీప్ శర్మ గారి ఈ సేవాభావం గ్రామానికి ఆదర్శంగా నిలుస్తుందని, భవిష్యత్తులో కూడా ఆయనకు దైవ కృప లభించాలని ఆకాంక్షిస్తూ ఆలయ కమిటీ, గ్రామ ప్రజల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.లక్ష్మీదేవుని పల్లి గుడి నిర్మాణంలో ఇది ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోతుందని గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు.