బోయగూడా సిసి రోడ్డు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ శంకుస్థాపన – గ్రామస్తుల ప్రశంసలు
గ్రామంలో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకుని, కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.
By Ram Reddy
On
లోకల్ గైడ్: జిల్లేడు చౌదర్ గూడ :

పద్మారం నుంచి బోయగూడాకు వెళ్లే రహదారిని రూ.1.43 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. మారుమూల ప్రాంతమైన బోయగూడాకు రోడ్డు సదుపాయం కల్పించడం ద్వారా ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని అన్నారు. అలాగే గ్రామంలో డ్రైనేజీ మరియు ఇతర మౌలిక వసతుల సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు.
ఈ సందర్భంగా గ్రామస్తులు ఎమ్మెల్యేను అభినందిస్తూ, ఇప్పటివరకు తమ గ్రామానికి వచ్చి ప్రత్యక్షంగా మాట్లాడి సమస్యలను తెలుసుకున్న ఎమ్మెల్యే ఎవరూ లేరని తెలిపారు. అయితే వీర్లపల్లి శంకర్ గ్రామానికి వచ్చి సమస్యలను తెలుసుకుని రహదారి అభివృద్ధికి శ్రీకారం చుట్టడం తమ అదృష్టంగా భావిస్తున్నామని కొనియాడారు. గ్రామ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలకు కృతజ్ఞతలు తెలిపారు.
గ్రామ సర్పంచ్ బందయ్య మాట్లాడుతూ, ఎమ్మెల్యే అండదండలతో గ్రామంలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. భవిష్యత్తులో కూడా గ్రామానికి ఇదే విధంగా సహకారం అందించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు సలేంద్రంపల్లి రాజు , పార్టీ నాయకులు, సర్పంచులు, మాజీ జెడ్పిటిసిలు, ఎంపీటీసీలు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ కార్యకర్తలు, ఎమ్మార్వో, ఎంపీడీఓ, ఏఈ, డీఈ తదితర అధికారులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలు, మహిళలు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Tags:
About The Author
Latest News
22 Feb 2026 00:04:05
లోకల్ గైడ్: జిల్లేడు చౌదర్ గూడ :
జిల్లేడు చౌదర్ గూడ మండలంలోని ఎల్కగూడ గ్రామపంచాయతీ బోయగూడ లో అభివృద్ధి పనుల్లో భాగంగా ఎమ్మెల్యే వీర్లపల్లి
