ముందస్తు అరెస్టుల తో ఉద్యమాన్ని ఆపలేరు
బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్
మిడ్జిల్ ఆగస్టు 22 (లోకల్ గైడ్):
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తూ ప్రశ్నిస్తున్న భారతీయ జనతా పార్టీ నాయకులను ముందస్తుగా అరెస్టులు చేయడం వల్ల ఉద్యమాన్ని ఆపలేరని జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ అన్నారు శుక్రవారం స్థానిక పోలీసులు ఆయనను ముందస్తుగా అరెస్టు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ చలో సెక్రటేరియట్ కు బిజెపిరాష్ట్ర పార్టీ పిలుపునివ్వడం జరిగిందని ఆయన అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఉద్యమాలు చేస్తున్నటువంటి ప్రతిపక్ష పార్టీలనాయకులను ముందస్తు అరెస్టులు చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు ఎన్నికల సమయంలో అమలు చేయలేని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం నేటికీ హామీలను అమలు చేయడం లేదని ఆయన అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వనికి స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని అయన అన్నారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినా హామీలను నెరవేర్చాలని భారతీయ జనతా పార్టీ పాలమూరు జిల్లా శాఖ డిమాండ్ చేస్తుందని అయన అన్నారు