వయో వృద్ధుల సంరక్షణ చట్టాల గురించి వివరించిన న్యాయమూర్తి
ఖమ్మం జిల్లా లోకల్ గైడ్ :
మధిర మండల న్యాయ సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో మధిర సీనియర్ సివిల్ జడ్జ్ ప్రశాంతి మేడం, ముఖ్య వక్తగా, వయోవృద్ధుల సంరక్షణ చట్టం గురించిన అవగాహన సదస్సు మధిర మండల విశ్రాంత ఉద్యోగుల భవనంలో నిర్వహించారు. జడ్జ్, వయోవృద్ధుల, తల్లి తండ్రుల సంరక్షణార్ధం అమల్లో ఉన్న చట్టాలు, సమస్యల పరిష్కారానికి అవలంబించవల్సిన చట్ట బద్ధమైన మార్గాలు తెలిపి అనుమానాలు నివృత్తి చేశారు. అవసరమైనప్పుడు కోర్ట్ ఆవరణలోగల న్యాయ సేవా సంస్థ వారి సహకారం ఉచితంగా పొందవచ్చునన్నారు. గౌరవ న్యాయమూర్తిని, రిటైర్డ్ ఉద్యోగుల సంఘ బాధ్యులు శాలువ, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఉద్యోగుల సంఘ మండల అధ్యక్షులు పారుపల్లి వెంకటేశ్వరరావు, తెలంగాణ వయో వృద్ధుల సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాధవరపు నాగేశ్వరరావు, ప్రముఖ న్యాయవాది చావలి రామరాజు, రిటైర్డ్ ఉద్యోగులు, న్యాయ సేవా సంస్థ కార్యకర్తలు పాల్గొన్నారు.