అంతరించిపోతున్న ‘కుమ్మరి’ చేతివృత్తులు
ప్లాస్టిక్ దెబ్బకు మాయమవుతున్న మట్టి పాత్రలు.
తిరుగుడు చక్రం నెమ్మదించింది...జీవనోపాధి కోల్పోతున్న కళాకారులు. మట్టి వాసన మసకబారిపోతుంది. - ప్రభుత్వ మద్దతు కోసం ఎదురుచూపులు
లోకల్ గైడ్/ తాండూర్: ఒకప్పుడు గ్రామాలలో పండగలు వచ్చినా, పెళ్లిలు, నూతన గృహప్రవేశాలు, దేవుని నైవేద్యం తదితర శుభకార్యాల కోసం మట్టికుండలను ఎంతో సాంప్రదాయంగా వినియోగించేవారు. కుమ్మరి వారి ఇంటి నుంచి మట్టి కుండ లేకుండా ఎలాంటి శుభకార్యాలు జరిగేవి కావు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.ఆనాడు మట్టి కుండలకు అంత ప్రాధాన్యత ఉండేది. కానీ నేడు మార్కెట్లో ప్లాస్టిక్ వాడకం విపరీతంగా పెరిగిపోవడం ద్వారా కుమ్మరి కళాకారుల చేతివృత్తులు అంతరించిపోతున్నాయి.
*కుమ్మరుల ఆర్థిక స్థితిగతులు.*
కుమ్మరులు ఆర్థికంగా వెనుకబడిపోయారు.ఎందుకంటే గతంలో మట్టి పాత్రలు తయారు చేసే సమాజానికి అందించినప్పుడు కొద్దో గొప్పో ఆర్థికంగా బాగుండేది.కానీ ప్లాస్టిక్, సిరామిక్,స్టీల్ వచ్చిన తరువాత కుమ్మరుల వృత్తి అడుగంటి పోయింది. విషయం ఏమిటంటే, ప్రజల తిరిగి మళ్లీ మట్టి పాత్రలవైపు మొగుచూపుతుండడం హర్షనీయం.
*కుమ్మరి చేతివృత్తుల డిమాండ్లు.*
గ్రామ స్థాయి హస్తకళా హాట్‌లు (స్థిర విక్రయ కేంద్రాలు)మట్టి, కట్టెల లభ్యతకు ఒక్క విండో అనుమతులు..తిరుగుడు చక్రాల విద్యుతీకరణ, కిల్న్‌లకు సబ్సిడీలు,డిజైన్–బ్రాండింగ్ శిక్షణ, ఆన్‌లైన్ విక్రయ సహాయం,పాఠశాల–కాలేజీల్లో కళా మేళాలు, ‘ఒక పండుగ—ఒక మట్టి ఉత్పత్తి’ ప్రచారం గ్రామాల గుర్తింపే గళగళలాడే ఆ చక్రం. ఆ శబ్దం మళ్లీ వినిపించాలంటే ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేటు రంగం చేతులు కలపాల్సిన సమయం ఇదే.లేదంటే మన చేతుల ముందే మట్టికళ మట్టిలో కలిసిపోయే ప్రమాదం ఉంది ఆకాంక్షిస్తున్నారు.
*మట్టి ప్రమిద ఎంతో ప్రత్యేక.*
ప్రతి దేవాలయం దగ్గర, ఇంట్లో పూజ గదిలో, శుభ కార్యాలలో మట్టి ప్రమిద లేనిది పూజ నిర్వహించలేం. అలాంటిది నేడు మట్టి ప్రమిదలు కనుమరుగ అయ్యే పరిస్థితి దాపరించింది. శుభ కార్యాల్లో, దసరా దీపావళి తదితర పండుగల సందర్భంగా కూడా మట్టి ప్రమిదలో నూనె పోసి దీపం వెలిగిస్తారు. రాను రాను ప్లాస్టిక్ వినియోగం పెరగడంతో మట్టి ప్రమిదలు కనుమరుగవుతున్నాయి.