వినాయక మండపాలలో జాగ్రత్తలు పాటించాలి
కరెంట్ తీగల్లో తగిలి ప్రమాదం ఉందని పోలీసులు సూచిస్తున్నారు
By Ram Reddy
On
వినాయక విగ్రహాలుఏర్పాటుకు అనుమతి తప్పనిసరి విగ్రహాల ఏర్పాటు ఆన్లైన్ ద్వారా సమాచారం అందించాలి . మోమిన్ పెట్ సర్కిల్ఇ న్స్పెక్టర్ బి.వెంకట్
వికారాబాద్ జిల్లా, లోకల్ గైడ్:
ఈ నెల 27న బుధవారం వినాయక చవితి పండుగ సందర్భంగా వికారాబాద్ జిల్లా మోమిన్పేట్, నవాబ్ పేట్ మండల పరిధిలో ఉన్న గణేష్ మండపాలలో వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసుకుని ఉత్సవాలు జరుపుకోవాలనుకునేవారు తప్పనిసరిగా పోలీస్ శాఖ నుండి అనుమతి పొందాలని, ఆన్లైన్ ద్వారా విగ్రహాల ఏర్పాటు కు సంబంధించిన పూర్తి సమాచారం ఆన్లైన్ ద్వారా అందించాలని దరఖాస్తు దారుని వివరాలు, విగ్రహం ఏర్పాటు చేస్తున్న మండపం ఎత్తు, కమిటీ సభ్యులు పేర్లు వారి ఫోన్ నెంబర్లు, విగ్రహం ప్రతిష్టించే రోజు,నిమజ్జనం చేసే తేదీ సమయం, ప్రదేశం, ఆ ప్రదేశానికి ఏ వాహనంలో చేరుకుంటారు, అదేవిధంగా మండప నిర్వహకులు, గణపతి కమిటీ సభ్యులు, వాలంటీర్ల వివరాలు, ఫోన్ నెంబర్లు చిరునామా పూర్తిగా నమోదు చేయాలని సూచించారు.వికారాబాద్ జిల్లాలోని మోమిన్ పేట, నవాబ్ పేట్ మండల పరిధిలోని ఉన్న గ్రామాలలో నిర్వహించే గణపతి మండప నిర్వహకులు ఈ వెబ్సైట్ నందు వివరాలను పొందుపరచాలని సూచించారు.పర్యావరణ పరిరక్షణకు ఉత్సవ కమిటీ సభ్యులు మట్టి వినాయక ప్రతిష్టాపనకు ప్రాధాన్యత కేటాయించాలని తెలిపారు. ఎలాంటి అత్యవసర సమయంలోనైనా వికారాబాద్ జిల్లా పోలీస్ యంత్రాంగం 24 గంటలు అందుబాటులో అప్రమత్తంగా ఉంటుందని వెంటనే డయల్ 100 కు సంప్రదించాలని తెలియజేశారు. మండపాలలో వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసుకొని ఉత్సవాలు నిర్వహించే వారు తప్పని సరిగా పోలీస్ శాఖ నిబంధనలకు లోబడి నడుచుకోవాలని మోమిన్ పెట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశం తెలిపారు తెలిపారు.Tags:
About The Author

Latest News
19 Aug 2025 20:08:16
వినాయక విగ్రహాలుఏర్పాటుకు అనుమతి తప్పనిసరి విగ్రహాల ఏర్పాటు ఆన్లైన్ ద్వారా సమాచారం అందించాలి . మోమిన్ పెట్ సర్కిల్ఇ న్స్పెక్టర్ బి.వెంకట్
