బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు విస్తృత స్థాయి సమావేశం

రాజకీయ వ్యూహరచన పై బిజెపి నేతలు మంతనాలు

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు విస్తృత స్థాయి సమావేశం

ప్రజా సమస్యల పరిష్కారమే బిజెపి ధ్యేయం

హైదరాబాద్, (లోకల్ గైడ్ ప్రతినిధి):

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు అధ్యక్షతన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శాసనసభ, శాసనమండలి సభ్యుల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. పార్టీ శక్తి విస్తరణ, ప్రజా సమస్యలు, రాబోయే రాజకీయ వ్యూహరచనపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ డాక్టర్ అంజిరెడ్డి పాల్గొన్నారు. అదేవిధంగా బీజేపీ శాసనసభ పక్ష నాయకులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, బీజేపీ శాసనమండలి పక్ష నాయకులు ఎవిఎన్ రెడ్డి, రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారి హాజరై ముఖ్యమైన సూచనలు చేశారు. ఈ సందర్భంగా పలువురు ఎమ్మెల్యేలు, ఎంఎల్సీ లు పాల్గొని తమ అభిప్రాయాల ను వ్యక్తం చేశారు. పార్టీ బలోపేతం దిశగా, ప్రజా సమస్యల పరిష్కారానికి బీజేపీ కట్టుబడి ఉందని నేతలు ఈ సమావేశంలో స్పష్టం చేశారు.

Tags:

About The Author

Latest News

వరద బాధితులను ఆదుకొంటాం వరద బాధితులను ఆదుకొంటాం
కామారెడ్డి,లోకల్ గైడ్ : ఇటీవల కురిసిన భారీ వర్షాల వలన పంటలు, రహదారులు, గృహాలు, మౌలిక వసతులు తీవ్రంగా దెబ్బతిన్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్య మంత్రి ఎనుముల...
సర్వేపల్లి నూతన విగ్రహావిష్కరణ
కులాంతర వివాహ ప్రోత్సాహక బహుమతిని అందజేసిన జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మి నారాయణ
సీఎం ప్రజావాణి” కి బ్యాటరీ వాహనం
అన్నారం రైతుల పంట నష్టంపై మంత్రి వివేక్ వెంటనే స్పందన
అసెంబ్లీ లో బి.సి.లకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసిన సందర్భంగా
లండన్‌లో ఘోర రోడ్డుప్రమాదం: హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు సోదరులు మృతి