స్లోగన్: “విద్యతో విలువ – నైపుణ్యంతో భవిష్యత్”

స్లోగన్: “విద్యతో విలువ – నైపుణ్యంతో భవిష్యత్”

 

ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రాంగణంలో విద్యార్థులు, అధ్యాపకులు, విశ్వవిద్యాలయ అధికారులతో కలిసి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి సమక్షంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొని సంక్షేమ శాఖ మంత్రి శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు ప్రసంగించారు.

IMG-20250825-WA0236

ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ –

108 ఏళ్ల చరిత్ర కలిగిన ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలంగాణ గర్వకారణమని, రాష్ట్ర ఆవిర్భావంలో ఈ విశ్వవిద్యాలయం పోషించిన పాత్ర అపూర్వమని గుర్తుచేశారు. గత పదేళ్లలో విశ్వవిద్యాలయాల అభివృద్ధి నిర్లక్ష్యం పాలైందని, కానీ ప్రస్తుత ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన వెంటనే విశ్వవిద్యాలయాల అభివృద్ధికి చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుందని పేర్కొన్నారు.

 

ముఖ్యంగా, ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అనుమతులు, వసతి గృహాల నిర్మాణం, నాణ్యమైన విద్య అందించడానికి అవసరమైన చర్యలు ప్రారంభించామని తెలిపారు. ప్రభుత్వం లక్ష్యం విద్యార్థులకు కేవలం డిగ్రీలు కాకుండా, నైపుణ్యాలు కల్పించడం అని, ప్రపంచ స్థాయి పోటీలో నిలవడానికి స్కిల్ డెవలప్మెంట్ అత్యవసరమని ఆయన సూచించారు.

IMG-20250825-WA0235

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారికి గౌరవ డాక్టరేట్ ప్రధానం చేయడం ఉస్మానియా విశ్వవిద్యాలయ గౌరవాన్ని మరింత పెంచిందని అన్నారు. సంక్షేమ శాఖ నుంచి పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు అవసరమైన నిధులు మంజూరు చేస్తూ, విద్యా అవకాశాలను విస్తరించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు.

IMG-20250825-WA0234

చివరగా, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని భవిష్యత్తును నిర్మించుకోవాలని, రాష్ట్ర అభివృద్ధి మీ అభివృద్ధిపైనే ఆధారపడి ఉందని మంత్రి గారు స్పష్టం చేశారు.

 

IMG-20250825-WA0235IMG-20250825-WA0233

Tags:

About The Author

Latest News

వరద బాధితులను ఆదుకొంటాం వరద బాధితులను ఆదుకొంటాం
కామారెడ్డి,లోకల్ గైడ్ : ఇటీవల కురిసిన భారీ వర్షాల వలన పంటలు, రహదారులు, గృహాలు, మౌలిక వసతులు తీవ్రంగా దెబ్బతిన్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్య మంత్రి ఎనుముల...
సర్వేపల్లి నూతన విగ్రహావిష్కరణ
కులాంతర వివాహ ప్రోత్సాహక బహుమతిని అందజేసిన జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మి నారాయణ
సీఎం ప్రజావాణి” కి బ్యాటరీ వాహనం
అన్నారం రైతుల పంట నష్టంపై మంత్రి వివేక్ వెంటనే స్పందన
అసెంబ్లీ లో బి.సి.లకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసిన సందర్భంగా
లండన్‌లో ఘోర రోడ్డుప్రమాదం: హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు సోదరులు మృతి