జాతీయ ఉపాధి హామీ పథకంలో రైతులకు ఉపయోగకరమైన పనులు చేపట్టాలి

జిల్లా కలెక్టర్  అభిలాష అభినవ్

జాతీయ ఉపాధి హామీ పథకంలో రైతులకు ఉపయోగకరమైన పనులు చేపట్టాలి

లబ్ధిదారులతో కలిసి పశువుల పాక ప్రారంభం. 

నిర్మల్ లోకల్ గైడ్ :
జాతీయ ఉపాధి హామీ పథకం (ఈజీఎస్) కింద రైతులకు, కూలీలకు ఉపయోగకరమైన పనులను చేపట్టాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు.
      శుక్రవారం నిర్మల్ గ్రామీణ మండలం డ్యాంగాపూర్‌లో నిర్వహించిన పనుల జాతర కార్యక్రమంలో భాగంగా ఈజీఎస్ నిధులతో నిర్మించిన పశువుల పాకను లబ్ధిదారులతో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ, జాతీయ ఉపాధి హామీ పనుల్లో రైతులకు ఉపయోగపడే గొర్రెలు, పశువుల పాకలు, పౌల్ట్రీ, పొలంబాటలు వంటి పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రతి గ్రామపంచాయతీ స్థాయిలో ప్రజలకు ఉపాధి హామీ పనులపై అవగాహన కల్పించాలని ఆదేశించారు.
జిల్లాలో 100% అక్షరాస్యత సాధించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని తెలిపారు. ప్రతి ఒక్కరికి చదవడం, రాయడం వచ్చేటట్లు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో వాలంటీర్లను నియమించి అక్షరాస్యతను పెంపొందించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. అనంతరం 100 రోజుల ఈజీఎస్ పనులు పూర్తిచేసిన కూలీలను ఈ సందర్బంగా కలెక్టర్ సన్మానించారు.
       ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, ఆర్డీఓ రత్న కళ్యాణి, ఎంపీడీవో గజానన్, అధికారులు, ఉపాధి హామీ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

వరద బాధితులను ఆదుకొంటాం వరద బాధితులను ఆదుకొంటాం
కామారెడ్డి,లోకల్ గైడ్ : ఇటీవల కురిసిన భారీ వర్షాల వలన పంటలు, రహదారులు, గృహాలు, మౌలిక వసతులు తీవ్రంగా దెబ్బతిన్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్య మంత్రి ఎనుముల...
సర్వేపల్లి నూతన విగ్రహావిష్కరణ
కులాంతర వివాహ ప్రోత్సాహక బహుమతిని అందజేసిన జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మి నారాయణ
సీఎం ప్రజావాణి” కి బ్యాటరీ వాహనం
అన్నారం రైతుల పంట నష్టంపై మంత్రి వివేక్ వెంటనే స్పందన
అసెంబ్లీ లో బి.సి.లకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసిన సందర్భంగా
లండన్‌లో ఘోర రోడ్డుప్రమాదం: హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు సోదరులు మృతి