ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నియమాలు పాటించాలి

ఎస్సై అశోక్ బాబు

ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నియమాలు పాటించాలి

నారాయణపేట ఏప్రిల్ 15:
ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే రోడ్డు ప్రమాదాలు నివారించవ చ్చని మాగనూర్ ఎస్సై అశోక్ బాబు అన్నారు.
జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఆదేశాల మేరకు భూమి 
అరయవ్ అలైన్ కార్యక్రమంలో భాగంగా మాగనూరు మండలంలోని జెడ్పిహెచ్ఎస్ హైస్కూల్లో ఎస్సై అశోక్ బాబు ఆధ్వర్యంలో విద్యార్థులకు రోడ్డు భద్రత నియమాలపై విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేయించి అనంతరం వారు తమ తల్లిదండ్రులకు రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని కోరుతూ లేఖలు రాయించారు. అదేవిధంగా గతంలో జరిగిన రోడ్డు ప్రమాదాలపై వీడియో క్లిప్పింగులు ప్రదర్శించి, ప్రమాదాల తీవ్రతను విద్యార్థులకు కళ్లకు కట్టినట్లు చూపించారు.ఈ సందర్భంగా ఎస్సై అశోక్ బాబు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా మన నిర్లక్ష్యం వల్లే జరుగుతున్నాయి అని అవగాహన పెరిగితేనే ఈ ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చు అని తెలిపారు. వాహనం నడిపేటప్పుడు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలి. చిన్న తప్పిదం కూడా ప్రాణనష్టానికి దారితీస్తుంది సూచించారు.
హెల్మెట్, సీట్ బెల్ట్ వాడకం ప్రాణాలను కాపాడుతుంది. ఇవి కేవలం చట్టపరమైనవి మాత్రమే కాదు, మన భద్రత కోసం తప్పనిసరి అన్నారు.
మద్యం సేవించి వాహనం నడపడం, మొబైల్ ఫోన్ ఉపయోగించడం వంటి అలవాట్లు ప్రమాదాలకు ప్రధాన కారణాలు. వీటిని పూర్తిగా నివారించాలి కోరారు.విద్యార్థులు సమాజంలో మార్పుకు మార్గదర్శకులు. మీరు నేర్చుకున్న రోడ్డు భద్రత నియమాలను మీ తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు తెలియజేయాలి అని తెలిపారు.వీడియోల ద్వారా చూపించిన ప్రమా దాలు మనకు హెచ్చరిక. జాగ్రత్తగా ఉంటేనే మన ప్రాణాలు, ఇతరుల ప్రాణాలు రక్షించగలుగుతాం అని తెలిపారు. రోడ్డు భద్రత – ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు
ఫోటో రైట్ అప్:5.అవగాహన కల్పిస్తున్న పోలీసులు 
_____________________
Tags:

About The Author

Latest News