బెల్లంపల్లి (లోకల్ గైడ్)
బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆదేశాల మేరకు ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వార్డు కౌన్సిలర్ చింతల వసంత ఆధ్వర్యంలో గురువారం15వ వార్డులో గ్రామసభ నిర్వహించారు.99రోజుల యాక్షన్ ప్లాన్ కార్యక్రమంలో భాగంగా ఈ వార్డు సభకు టేకులబస్తి15వ వార్డు పరిధిలోని ప్రజలందరు హాజరై వారి సమస్యలను పరిష్కరించుకునేందుకు హాజరై కౌన్సిలర్ సంబంధిత అధికారులకు తెలియజేశారు.ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99రోజుల కార్యచరణ ప్రణాళిక కార్యక్రమంలో వార్డులో ఇందిరమ్మ ఇండ్లు వచ్చిన పలువురు లబ్ధిదారులు ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డాక తమకు ఇందిరమ్మ ఇండ్లు వచ్చాయని,అదేవిధంగా రేషన్ కార్డులు,200 యూనిట్లు ఉచిత విద్యుత్ సౌకర్యం,500రూపాయల గ్యాస్ సబ్సిడీ,ఉచిత బస్సు ప్రయాణం లాంటి అనేక సౌకర్యాలు,అంతేకాకుండా రైతు రుణమాఫీలు అందజేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,బెల్లంపల్లి ఎమ్మెల్యే,కౌన్సిలర్ లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ప్రజల అవసరాలు గుర్తిస్తు ఎప్పటికప్పుడు స్పందిస్తు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న కౌన్సిలర్ ను స్థానికులు అభినందించారు.ప్రజల సమస్యలపై వేగంగా స్పందించడం వల్ల ప్రజాప్రతినిధులపై నమ్మకం మరింత బలపడుతుందని బస్తి ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ ఎస్ చంద్రశేఖర్,వార్డు అధికారి ఆయిళ్ళ అశోక్,అంగన్వాడీ టీచర్ ఆయిడపు పద్మ,ఆర్ పి బందెల శ్రీలత,సోషల్ మీడియా టిపిసిసి జిల్లా కన్వీనర్ దేవసాని ఆనంద్,వార్డు ఇంచార్జి
కన్నూరి వెంకటేష్, దెబ్బెటి రమేష్,కాశీపాక రాజరత్నం,కన్నూరి రాజలింగు,ఎస్కె గౌస్,బొల్లి వంశీ,కోమిరెడ్డి బాలు,చింతల లోకేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.