నిరుద్యోగ మైనారిటీ యువతకు విదేశీ ఉపాధి అవకాశాలు
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
By Ram Reddy
On
మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్)
తెలంగాణ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్,తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ ల ఆధ్వర్యంలో జిల్లాలోని నిరుద్యోగ మైనారిటీ యువతకు విదేశీ ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.విదేశాలలో ఉన్న ఉద్యోగ అవకాశాలపై జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో మండల,జిల్లా స్థాయిలో అవగాహన శిబిరాలు నిర్వహించాలని,మున్సిపల్ కమిషనర్లు,మండల పరిషత్ అభివృద్ధి అధికారులు ఉపాధి అవకాశాల సమాచారాన్ని వాట్సాప్ గ్రూపుల ద్వారా విస్తృత ప్రచారం చేయాలని సూచించారు.కార్యాలయాల నోటీసు బోర్డులలో సమాచారం ప్రదర్శించాలని తెలిపారు.జిల్లా పౌర సంబంధాల శాఖ ద్వారా దినపత్రికలు,ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్ ల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించాలని,విద్యాసంస్థల ప్రిన్సిపల్ లు అర్హులైన విద్యార్థులకు,నిరుద్యోగ యువతకు సమాచారం అందించాలని తెలిపారు.పలు దేశాలలో అందుబాటులో ఉన్న ఉద్యోగ అవకాశాలను అర్హత గల మైనారిటీ నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.జర్మనీ దేశంలో నర్సింగ్,ఎలక్ట్రికల్,పవర్ లైన్ టెక్నీషియన్ ఉద్యోగాలు,ఖతార్,దోహా దేశాలలో నర్సింగ్ ఉద్యోగాలు,గ్రీస్ దేశంలో హాస్పిటాలిటీ,హౌస్ కీపింగ్,వెయిటర్లు,బార్బెండర్లు,వంట మనుషులు,హోటల్ రిసెప్షనిస్ట్,స్పా థెరపిస్టులు,ఎలక్ట్రీషియన్లు,ప్లంబర్లు,లైఫ్ గార్డులు,గార్డెనర్లు,బెల్ బాయ్స్,ఫిషర్ మెన్ ఇతర ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని తెలిపారు.ఉద్యోగాల సంబంధిత విద్యార్హతలతో పాటు అభ్యర్థుల వయసు 21నుండి 35సంవత్సరాల మధ్య ఉండాలని,ఇంగ్లీష్ భాష పరిజ్ఞానం కలిగి ఉండాలని,2,3 సంవత్సరాల అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు.వసతి,ఆహారం,మెడికల్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా కల్పించడం జరుగుతుందని తెలిపారు.ఆసక్తి అర్హత గల మైనారిటీ అభ్యర్థులు తమ బయోడేటా,సివి వెంటనే tomcomglobal@gmail.com, tomcom.resume@gmail.com లకు మెయిల్ చేయవచ్చని,ఇతర వివరాలకు 9440048590,9440049937,9440051452,8919047600 నంబర్లలో సంప్రదించవచ్చని తెలిపారు.
Tags:
About The Author
Latest News
16 Apr 2026 20:20:20
నిలువునా రాలిపోతున్న ప్రాణాలకు దిక్కెవరు?
నిరంతరం ప్రమాదాలు జరిగే చోట నివారణ చర్యలు ఏవి?
