ఘనంగా రన్ ఫర్ జీసస్ ప్రపంచ శాంతి ర్యాలీ
*
ఖమ్మం :లోకల్ గైడ్,:
ప్రపంచ శాంతి కోసం ఖమ్మం పట్టణంలో రన్ ఫర్ జీసస్ కార్యక్రమం కో ఆర్డినేటర్ చల్లగుండ్ల రమేష్ బాబు మరియు ఆహ్వాన కమిటీ సభ్యులు పి.జేకర్యా , సత్యం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆఫీసు ఇంచార్జీ దయాకర్ రెడ్డి జెండా ఊపి ర్యాలీనీ ప్రారంభించినారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ శాంతి కోసం , యేసు ప్రభువు ఇచ్చే శాంతి మన దేశానికి కావాలి అని కోరుతు ఉన్న క్రైస్తవులను అభినందిస్తూ మేము ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటామని అన్నారు . మరో అతిధి కతోలిక బిషప్ డాక్టర్ సగిలి ప్రకాష్ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా మానవాళికి యేసు మాత్రమే శాంతి అని మానవులంతా యేసు ఇచ్చే శాంతిని కోరుతూ కలిసి మెలిసి ఉండాలని కోరారు . కమిటీ సభ్యులు జేకర్యా , సత్యం ఖమ్మం పట్టణం లో క్రైస్తవులంత సమైక్యత కలిగి వేలాది మంది ప్రజలు తరలి వచ్చి శాంతి ర్యాలీలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని అన్నారు . క్రైస్తవ రాజకీయ నాయకులు పల్లా రాజశేఖర్ ( సిఎస్ఐ పీస్ కమిటీ చైర్మన్ ) , బొమ్మెర రామ్మూర్తి ( ఖమ్మం జిల్లా క్రైస్తవ నాయకులు ) పాల్గొని ప్రజలు శాంతి కలిగి మత సామరస్యంను కాపాడాలని వ్యక్తపరిచినారు . పలువురు క్రైస్తవ పెద్దలు , నాయకులు పాల్గొని ప్రపంచ శాంతి కోసం ప్రార్దనలు చేశారు . ఈ కార్యక్రమంలో పట్టణ మరియు రఘునాథ పాలెం , పాలేరు నియోజకవర్గం , ఖమ్మం రూరల్ మండలం నుండి ప్రజలు పెద్ద సంఖ్య లో పాల్గొన్నారు . ఈ ర్యాలీ వేల మందితో పెవిలియన్ గ్రౌండ్ నుండి జడ్పీ సెంటర్ మీదుగా ఎన్టీఆర్ సర్కిల్ కాలేజ్ గ్రౌండ్ వరకు కొనసాగింది . ఈ కార్యక్రమములో నిర్వహణ కమిటీ సభ్యులు ఆర్.సి.యం చర్చి జనరల్ సెక్రటరీ ఫాదర్ శౌరి , ఏర్పుల ప్రభాకర్ రావు (హెబ్రోన్ చర్చి ఎల్డర్) , పట్టణ పాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ లు కొమ్ము బాబురావు , పాల్ సంజీవరావు , రమేష్ పాల్ , నేలాల బాలస్వామి (సుజనరాయ్ మినిస్ట్రీస్) , బి వి రత్నం (పాలేరు అధ్యక్షులు ) సామ్యూల్ పిన్ని , చిన్ని డేవిడ్ , జీవ రత్నం , సుందర్ రావు , సంతోష్ కుమార్ , అబ్రాహాము , ఫాదర్ ఐజెక్ , విజయ్ , ప్రసాద్ , యోహాను , విలియం కెరీ , సురేష్ , రవి కిరణ్ , శ్యామ్ బాబు తదితరులు పాల్గొన్నారు .
