సారపాకలో 30 అడుగుల రోడ్డు కోసం గ్రామసభలో

అధికారులకు వినతిపత్రం 

సారపాకలో 30 అడుగుల రోడ్డు కోసం గ్రామసభలో

 

బూర్గంపాడు : లోకల్ గైడ్ :
బూర్గంపాడు మండలం సారపాక గ్రామ పరిధిలోని రామభద్ర ఐటీఐ కాలేజీ నుండి గాంధీనగర్ కాలనీ వరకు 30 అడుగుల బీటీ రోడ్డు నిర్మాణం చేయాలని కోరుతూ గ్రామసభలో అధికారులకు వినతిపత్రం సమర్పించారు.
గురువారం నిర్వహించిన గ్రామసభలో సారపాక గ్రామపంచాయతీ కార్యదర్శి మహేష్ సమక్షంలో ప్రత్యేక అధికారికి ఈ వినతిపత్రం అందజేశారు. ఈ రోడ్డు నిర్మాణం జరిగితే విద్యార్థులు, రైతులు మరియు గ్రామ ప్రజలకు రాకపోకలు సులభతరం అవుతాయని పేర్కొన్నారు.
ఈ రహదారి నిర్మాణం కోసం గతంలో కూడా ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్‌కు పలుమార్లు వినతిపత్రాలు అందజేసినట్లు తెలిపారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రోడ్డు నిర్మాణాన్ని ప్రారంభించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకుడు చుక్కపల్లి బాలాజీ, సీపీఐ జిల్లా నాయకుడు పేరాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News