ప్రజా వైద్యశాల డాక్టర్ రామయ్య కు  ఘనంగా సన్మానం

పేదవాడికి వైద్య సేవ అందటమే లక్ష్యం

ప్రజా వైద్యశాల డాక్టర్ రామయ్య కు  ఘనంగా సన్మానం

 

లోకల్ గైడ్ ఆగస్టు 24 సూర్యాపేట : 

సూర్యాపేట వైద్యరంగంలో
 1971లో ప్రతి పేదవాడికి వైద్య సేవ అందటమే లక్ష్యంగా ప్రజా వైద్యశాల పురుడు పోసుకుంది. ప్రజా వైద్యశాలలో ఈ 50 సంవత్సరాలలో  సుమారు 50 వేల ఆపరేషన్లతో కొన్ని లక్షల మంది పేషంట్ల కు  వైద్యం అందించడంలో సహాయం చేసిన ఘనత వైద్యుడు డాక్టర్ రామయ్య గారిది. ప్రస్తుతం సుప్రజా వైద్యశాలగా ఆత్యాధునికమైన వైద్య సేవలతో ప్రజల ముందుకొచ్చింది. సుమారు  300 మంది కాంపౌండర్లు, సిస్టర్లు ఇక్కడ వైద్య నైపుణ్యం పొంది  గ్రామీణ వైద్యులుగా ప్రతి గ్రామంలో  ప్రజా వైద్యశాల సేవలను మైమరిపిస్తూ వారి వారి ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు  ఏర్పాటు చేసుకొని లక్షల మంది పేద ప్రజలకు  వైద్యం అందుబాటులో తీసుకొచ్చి నందుకుగాను డాక్టర్ రామయ్య  వారందరికీ మనస్ఫూర్తిగా ఆశీస్సులు అందించారు. ఎంతోమంది పేద ప్రజలకు సేవ చేసి  పేదల డాక్టర్గా పేరు ప్రఖ్యాత సంపాదించుకున్నారు.ఈ సందర్భంగా ఆదివారం రోజు  దురాజ్ పల్లి బ్రాహ్మణ సదన్  లో  ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఏర్పాటుచేసి డాక్టర్ రామయ్య ని ఘనంగా సన్మానించి  సంతోషంగా ఉండాలని ఆశించారు. ఈ సందర్భంగా ప్రజా వైద్యశాలలో కాంపౌండర్లుగా, సిస్టర్లుగా పని చేసిన ప్రతి సిబ్బందికి డాక్టర్ రామయ్య  వారి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ,పర్వతం పుల్లచారి,చౌడయ్య, రాము,  అశ్విని కుమార్, కృష్ణ, ప్రభాకర్ , చిలువేరు చంద్రయ్య, ప్రకాష్,  పులుసు వెంకన్న , పుప్పాల లక్ష్మయ్య, గుండగాని రవి ,తాళ్లూరి ప్రభాకర్ ,జితేందర్ రెడ్డి,శేఖర్ , నగేష్ , సత్యనారాయణ, ఎల్లే వెంకటేశ్వర్లు, చిలువేరు అంజయ్య, డేగల జనార్ధన్. YV, అందరు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు

Tags:

About The Author

Latest News

వరద బాధితులను ఆదుకొంటాం వరద బాధితులను ఆదుకొంటాం
కామారెడ్డి,లోకల్ గైడ్ : ఇటీవల కురిసిన భారీ వర్షాల వలన పంటలు, రహదారులు, గృహాలు, మౌలిక వసతులు తీవ్రంగా దెబ్బతిన్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్య మంత్రి ఎనుముల...
సర్వేపల్లి నూతన విగ్రహావిష్కరణ
కులాంతర వివాహ ప్రోత్సాహక బహుమతిని అందజేసిన జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మి నారాయణ
సీఎం ప్రజావాణి” కి బ్యాటరీ వాహనం
అన్నారం రైతుల పంట నష్టంపై మంత్రి వివేక్ వెంటనే స్పందన
అసెంబ్లీ లో బి.సి.లకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసిన సందర్భంగా
లండన్‌లో ఘోర రోడ్డుప్రమాదం: హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు సోదరులు మృతి