17వ వార్డులో వార్డు సభ... 

99రోజుల యాక్షన్ ప్లాన్ కార్యక్రమం

17వ వార్డులో వార్డు సభ... 

 


బెల్లంపల్లి (లోకల్ గైడ్)

బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆదేశాల మేరకు ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వార్డు కౌన్సిలర్ ,మున్సిపల్ వైస్ చైర్మన్ రాగం శెట్టి సత్యనారాయణ ఆధ్వర్యంలో గురువారం17వ వార్డులో గ్రామసభ నిర్వహించారు.99రోజుల యాక్షన్ ప్లాన్ కార్యక్రమంలో భాగంగా ఈ వార్డు సభకు,17వ వార్డు పరిధిలోని ప్రజలందరు హాజరై వారి సమస్యలను పరిష్కరించుకునేందుకు హాజరై మున్సిపల్ వైస్ చైర్మన్ (17 వ వార్డు కౌన్సిలర్) సంబంధిత అధికారులకు తెలియజేశారు.ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99రోజుల కార్యచరణ ప్రణాళిక కార్యక్రమంలో వార్డులో ఇందిరమ్మ ఇండ్లు వచ్చిన పలువురు లబ్ధిదారులు ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డాక తమకు ఇందిరమ్మ ఇండ్లు వచ్చాయని,అదేవిధంగా రేషన్ కార్డులు,200 యూనిట్లు ఉచిత విద్యుత్ సౌకర్యం,500రూపాయల గ్యాస్ సబ్సిడీ,ఉచిత బస్సు ప్రయాణం లాంటి అనేక సౌకర్యాలు,అంతేకాకుండా రైతు రుణమాఫీలు అందజేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,బెల్లంపల్లి ఎమ్మెల్యే,కౌన్సిలర్ లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ప్రజల అవసరాలు గుర్తిస్తు ఎప్పటికప్పుడు స్పందిస్తు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న కౌన్సిలర్ ను స్థానికులు అభినందించారు.ప్రజల సమస్యలపై వేగంగా స్పందించడం వల్ల ప్రజాప్రతినిధులపై నమ్మకం మరింత బలపడుతుందని బస్తి ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో TPO ఆఫీసర్, వార్డు అధికారి ఉదయ్ కిరణ్, ఆర్ పి రాజలక్ష్మి, బస్తీ వాసులు తోకల రాజశేఖర్, బొద్దుల తిరుపతి, చిప్ప మల్లికార్జున, మీస కృష్ణ, తొంగల అంజయ్య, సామల రామచందర్, తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

దోమకొండలో 50 పడకల ఆసుపత్రి స్థలాన్ని పరిశీలించిన షబ్బీర్ అలీ దోమకొండలో 50 పడకల ఆసుపత్రి స్థలాన్ని పరిశీలించిన షబ్బీర్ అలీ
లోకల్ గైడ్ కామారెడ్డి జిల్లా  ఏప్రిల్ 2.కామారెడ్డి జిల్లా కేంద్రం లో దోమకొండ మండల కేంద్రంలో నూతనంగా మంజూరు చేయించిన 50 పడకల ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించి...
శేరిలింగంపల్లిలో ఘనంగా గణేష్ కుమార్ జన్మదిన వేడుకలు
17వ వార్డులో వార్డు సభ... 
కోనేరు అభివృద్ధికి పూజ 
కోటకొండలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక గ్రామ సభ 
మానవసేవే మాధవసేవ.. సమాజ సేవకుడు
కాటేదాన్ డివిజన్‌లో ఘనంగా హనుమాన్ జయంతి