పిల్లలకూ, మహిళలకూ అత్యున్నత వైద్య సేవలు
రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ సేవలు ప్రశాంతి హాస్పిటల్ లో
By Ram Reddy
On
రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ దినేష్ కుమార్ చీర్ల
హనుమకొండ జిల్లా ప్రతినిధి(లోకల్ గైడ్):
రెయిన్బో విస్తరణలో భాగంగా వరంగల్ లో 20వ ఆసుపత్రి అధికారికంగా ప్రారంభం,పీడియాట్రిక్ మల్టీస్పెషాలిటీ (శిశు సంరక్షణ), పెరినాటల్ కేర్ (గర్భిణీ వైద్య సేవలు) హాస్పిటల్ చైన్‌లో దేశవ్యాప్తంగా ప్రసిద్ది చెందిన రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ తమ సేవలను వరంగల్ పట్టణానికీ విస్తరించామని రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ దినేష్ కుమార్ చీర్ల ఆదివారం మీడియా సమావేశంలో వెళ్లడించారు. విభిన్న ప్రాంతాలకు తమ అత్యుత్తమ వైద్య సేవలను విస్తరించడంలో భాగంగా తన 20వ ఆసుపత్రిని వరంగల్‌లో ప్రారంభిం చామని, దశాబ్ద కాలంగా వరంగల్ నగరంలో నమ్మకమైన వైద్య సేవలను అందిస్తున్న ప్రశాంతి హాస్పిటల్ వేదికగా సంయుక్త భాగస్వామ్యంగా ఈ నూతన సౌకర్యాలను అందుబాటులోకి తీసుకువచ్చామని పేర్కొన్నారు. దీనిని ప్రస్తుతం పీడియాట్రిక్ కేర్ కు రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్‌గా అప్‌గ్రేడ్ చేశామన్నారు. ఈ ప్రయత్నం వరంగల్‌లకు అధునాతన పీడియాట్రిక్, నియోనాటల్, ప్రసూతి ఆరోగ్య సంరక్షణ సేవలను పొందవచ్చు అన్నారు. విశేష అనుభవజ్ఞులైన వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది బృందం అంతర్జాతీయ ప్రమాణాలతో వైద్య సేవలను అందిస్తుందని, చాలా ఏళ్లుగా అధునాతన మౌలిక సదుపాయాలతో, మోడ్రన్ టెక్నాలజీతో వినూత్న వైద్య ప్రమాణాలతో అందిస్తున్న సేవలు ఇకపై వరంగల్ ప్రజలకు కూడా అందుబాటులోకి రానున్నాయని వివరించారు.
రెయిన్బో ఆధ్వర్యంలో ప్రశాంతి హాస్పిటల్ వేదికగా 100 పడకలలతో అప్‌గ్రేడ్ చేయబడి, ఎన్ ఎ బి హెచ్-గుర్తింపు పొందిన ఈ సౌకర్యం అధునాతన ఎన్ఐసియూ, పిఐసియూ సేవలతో పాటు పీడియాట్రిక్ సబ్-స్పెషాలిటీలు మరింత మెరుగైన వైద్య సేవల తో పాటు హై-రిస్క్ ప్రెగ్నెన్సీ కేర్ (క్లిష్టమైన ప్రసవాలకు సురక్షితంగా అందించే చికిత్స) 24/7 గంటలు అందిస్తుందని చెప్పారు.
ఈ ప్రారంభోత్సవంలో భాగంగా రెయిన్బో చిల్డ్రన్స్ మెడికేర్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ దినేష్ కుమార్ చీర్ల మాట్లాడుతూ “మేము రెయిన్‌బో ప్రయాణంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నూతన ప్రారంభం చాలా ప్రత్యేకమైనదని, ప్రశాంతి హాస్పిటల్ ఆధ్వర్యంలోని అద్భుతమైన ఆ ఆబ్స్ట్రిక్ గైనిక్ సామర్థ్యాలను, వారి సేవలతో సమాజంలో సుస్థిరమైన నమ్మకాన్ని సంపాదించుకుందని, ఈ నమ్మకాన్ని, సంరక్షణ నాణ్యతలను మరింత పెంచడానికి రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో అధునాతన సాంకేతికత, నైపుణ్యాన్ని జోడించాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నామన్నారు.
ప్రశాంతి హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ ప్రశాంతి మచ్చా మాట్లాడుతూ “ప్రశాంతి హాస్పిటల్ ఎల్లప్పుడూ మహిళలు, పిల్లల సంరక్షణలో అత్యున్నత ప్రమాణాలకు కట్టుబడి ఉందని, రెయిన్‌బోతో ప్రస్తుత భాగస్వామ్యం వల్ల మా వైద్య ప్రమాణాలు మరింత బలోపేతం చేయడానికి తోడ్పాటును అందిస్తోందని, అంతేకాకుండా ఈ అధునాతన సౌకర్యాలతో పాటు దేశంలోని అత్యుత్తమ వైద్య నిపుణులతో మా పేషెంట్స్‌ను అనుసంధానించేలా చేయనున్నట్లు, ఇది సామాజిక ప్రజలకు ఉన్నతమైన వైద్య సేవలు అందించడానికి వీలు కల్పిస్తుందని పేర్కొన్నారు.డాక్టర్ దినేష్ కుమార్ చీర్ల సంస్థ గురించి వివరిస్తూ రెయిన్‌బో చిల్డ్రన్స్ మెడికేర్ లిమిటెడ్ నెట్‌వర్క్ 7 నగరాల్లో 20 ఆసుపత్రులతో పాటు 5 క్లినిక్‌లు ఉన్నాయని, వీటి 2,035 పడకల సామర్థ్యం, “రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్” బ్రాండ్ కింద పనిచేస్తున్న మా పీడియాట్రిక్ సేవల్లో నవజాత (అప్పుడే పుట్టిన చిన్నారులు), పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్, పీడియాట్రిక్ మల్టీ-స్పెషాలిటీ సేవలు, పీడియాట్రిక్ క్వాటర్నరీ కేర్ (అవయవ మార్పిడితో సహా) ఉన్నాయని, అయితే “బర్త్‌రైట్ బై రెయిన్‌బో” కింద మా మహిళా సంరక్షణ సేవలు సాధారణ, సంక్లిష్టమైన ప్రసూతి సంరక్షణ, మల్టీ డిస్ప్లినరీ ఫీటల్ కేర్, పెరినాటల్ జీన్, సంతానోత్పత్తి సంరక్షణతో పాటు గైనకాలజీ సేవలను కలిగి ఉన్న పెరినాటల్ కేర్ సేవలను అందిస్తున్నాయన్నారు.ఈ మోడల్ హైదరాబాద్‌లో విజయవంతంగా పనిచేస్తోందని, బెంగళూరులోనూ ఆదరణ పొందుతోందని, ఈ విధానాన్ని చెన్నైతో పాటు జాతీయ రాజధాని ప్రాంతం అంతటా పునరావృతం చేయడమే ఈ ప్రయత్నమన్నారు. తదనంతరం రెయిన్‌బో దక్షిణ భారతదేశంలోని టైర్ -2 సిటీస్‌లోకి విస్తరించాలని యోచిస్తోందని చెప్పారు. ఈ కంపెనీ ప్రైవేట్ హెల్త్‌కేర్‌లో దేశంలోనే అతిపెద్ద పీడియాట్రిక్ డిఎన్బి శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని, పోస్ట్ గ్రాడ్యుయేట్ రెసిడెన్షియల్ డిఎన్బి, ఫెలోషిప్ ప్రోగ్రామ్‌ను అందిస్తోందని పేర్కొన్నారు.
Tags:
About The Author
Latest News
05 Sep 2025 20:02:48
జిల్లా నలుమూలల నుంచి భద్రాచలం తరలి రానున్న వేలాది విగ్రహాలు