లోకల్ గైడ్/బంట్వారం:
పరిగి ప్రాంత రైతులకు మద్దతుగా వచ్చిన ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను పోలీసులు వికారాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. తొలుత ఆమెను దారూర్‌కు తరలించిన పోలీసులు, అనంతరం బంట్వారం పోలీస్ స్టేషన్‌కు మార్చి దాదాపు రెండు గంటల పాటు అక్కడ ఉంచారు.తరువాత సొంత పూచీకత్తుపై కవితను విడుదల చేసిన పోలీసులు, ఆమె హైదరాబాదుకు తిరిగి వెళ్లేందుకు అనుమతించారు. రైతుల సమస్యలపై స్పందించేందుకు ఆర్డీవో కార్యాలయానికి వచ్చిన సమయంలోనే ఆమెను అదుపులోకి తీసుకోవడం గమనార్హం.విడుదల అనంతరం కవిత మాట్లాడుతూ..రైతుల సమస్యలపై ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా విమర్శించారు. ఆమె అరెస్టుకు నిరసనగా రైతులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టడంతో ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.