దోమకొండలో 50 పడకల ఆసుపత్రి స్థలాన్ని పరిశీలించిన షబ్బీర్ అలీ
By Ram Reddy
On
లోకల్ గైడ్ కామారెడ్డి జిల్లా ఏప్రిల్ 2.కామారెడ్డి జిల్లా
దోమకొండ మండల కేంద్రంలో నూతనంగా మంజూరు చేయించిన 50 పడకల ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ కేటాయించిన భూమిని పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడి పరిస్థితులను సమగ్రంగా పరిశీలిస్తూ, స్థానికంగా ఉన్న పలు సమస్యలను తెలుసుకున్నారు.
స్థలానికి సంబంధించిన సమస్యలపై అధికారులు, స్థానిక ప్రజలతో చర్చించి, వెంటనే పరిష్కరించాల్సిన అంశాలపై సూచనలు ఇచ్చారు. ఆసుపత్రి నిర్మాణానికి ఎటువంటి అడ్డంకులు లేకుండా త్వరితగతిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా షబ్బీర్ అలీ గారు మాట్లాడుతూ, దోమకొండ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఈ 50 పడకల ఆసుపత్రి ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. అన్ని అనుమతులు పూర్తి చేసి త్వరలోనే ఆసుపత్రి నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Latest News
02 Apr 2026 19:45:14
లోకల్ గైడ్ కామారెడ్డి జిల్లా ఏప్రిల్ 2.కామారెడ్డి జిల్లా
కేంద్రం లో దోమకొండ మండల కేంద్రంలో నూతనంగా మంజూరు చేయించిన 50 పడకల ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించి...
