పట్టణాలలో పాలన సమర్థవంతంగా జరగాలి.....జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
సమీకృత జిల్లా కలెక్టరేట్ లో మంథని , సుల్తానాబాద్ మున్సిపాలిటీ ల పని తీరు పై సమీక్షించిన జిల్లా కలెక్టర్
పెద్దపల్లి, సెప్టెంబర్ 06 : లోకల్ గైడ్:
పట్టణాలలో పాలన సమర్థవంతంగా జరగాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు.
ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ,* పట్టణ ప్రాంతాలలో రోడ్లపై పశువులు ఉండకుండా గోశాలలకు తరలించాలని, కోతుల సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. పట్టణంలో ఎక్కడ డార్క్ ఏరియా ఉండకుండా అవసరమైన విద్యుత్ స్తంభాలు లైట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
పట్టణాలలో నివసించే ప్రజలకు ఎటువంటి ఆటంకాలు లేకుండా నీటి సరఫరా చేయాలని అన్నారు. పారిశుధ్య నిర్వహణలో భాగంగా రోడ్లపై ఎలాంటి చెత్త లేకుండా చూడాలని, వీధి కుక్కలు పందులను ఊరికి దూరంగా తరలించాలని అన్నారు.
పట్టణ ప్రణాళిక విభాగంలో భాగంగా ఎటువంటి ఆక్రమణలు రోడ్లపై లేకుండా చూడాలని, అనుమతి లేని నిర్మాణాలను వెంటనే తొలగించుటకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఇంటి పన్ను ఆస్తి పన్ను డెడ్లైన్ ప్రకారం 100% వసూలు చేయాలని , పట్టణాల్లోని మురికి కాలువలు, నాళాలలో సిల్టును పూర్తిస్థాయిలో తొలగించేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
పట్టణ ప్రాంతాలలో టి.యూ.ఎఫ్.ఐ.డి.సి , అమృత్ 2.0 క్రింద చేపట్టిన పలు అభివృద్ధి పనులు నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని, అభివృద్ధి పనులు నాణ్యతతో జరిగేలా ఎప్పటికప్పుడు నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్లు మంథని వెంకన్న, సుల్తానాబాద్ రమేష్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
----------------------------------------------------------