రైతు సంక్షేమమే బీజేపీ లక్ష్యం

కేంద్రం భరించే భారీ ఎరువుల సబ్సిడీ

రైతు సంక్షేమమే బీజేపీ లక్ష్యం

ఎమ్మెల్సీ అంజిరెడ్డి, గోదావరి

పఠాన్ చేరు, లోకల్ గైడ్ : 

రైతు భారం తగ్గించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఎరువులపై కోట్లాది రూపాయల సబ్సిడీ భరిస్తోంది. సాధారణ రైతు మార్కెట్ ధరలు చెల్లిస్తే సాగు అసాధ్యమయ్యే పరిస్థితి. కానీ బీజేపీ ప్రభుత్వం వల్ల రైతు తక్కువ  ధరకు ఎరువులు అందుకుంటున్నా రు.యూరియా 45 కేజీలు బస్తా, అసలు ధర: రూ.2503. రైతు చెల్లించేది రూ.267. మాత్రమే, కేంద్రం సబ్సిడీ: 2236 రూపాయలు.
డిఏపీ 50 కేజీలు, అసలు ధర: రూ.3771. రైతు చెల్లించేది: రూ.1311 మాత్రమే. కేంద్రం సబ్సిడీ: 2422 రూపాయలు.
ఒక ఎకరానికి ఒక పంట వేసేందుకు 2 యూరియా, 2 డిఏపి బస్తాలు అవసరం. అంటే ఒక్క పంటకు కేంద్రం సబ్సిడీ రూ.9316. రూపాయలు. ఏడాదికి రెండు పంటలకు కలిసి18,632. రూపాయలు సబ్సిడీ రైతు లాభం పొందుతారు. అదనంగా ప్రతి రైతుకు కిసాన్ సమ్మాన్ నిధి కింద సంవత్సరానికి రూ.6 వేలు జమ అవుతోంది. అందువల్ల ఒక ఎకరానికి సంవత్సరానికి రైతుకు లభించే కేంద్ర సహాయం మొత్తం 24,632 రూపాయలు. రైతు సంక్షేమమే దేశ సంక్షేమం, దేశ సంక్షేమమే బిజెపి సంకల్పం. "భారత్ మాతా కీ జై"

Tags:

About The Author

Latest News