తుర్క ఎనికే పల్లి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయండి.

ఎమ్మెల్యేతో తుర్క ఎనికే పల్లి గ్రామ ప్రజలు.

తుర్క ఎనికే పల్లి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయండి.

గ్రామ అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తా .. ఎమ్మెల్యే.  పరిగి

లోకల్ గైడ్    పరిగి :  గ్రామం జిల్లాకు చివరి దశలో ఉంది. మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల శివారు ప్రాంతానికి సమీపంగా తుర్క ఎనికేపల్లి గ్రామం ఉందని ఈ గ్రామ ప్రజలు పాలకులకు ఓట్లకే ఉపయోగపడతారు తప్ప అభివృద్ధిలో ఏ మాత్రం కనిపించమని తుర్కఎనికేపల్లి గ్రామానికి చెందిన గ్రామస్తులు, యువత ఎమ్మెల్యే తో  విన్నవించారు. పూడూరు మండల బిసి సెల్ ప్రధాన కార్యదర్శి సి.ప్రభాకర్ అధ్వర్యంలో పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్ రెడ్డినీ గ్రామ అభివృద్దికి తోడ్పాలని గ్రామస్తులు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సంధర్బంగా ఎమ్మెల్యేతో వారు గ్రామ సమస్యలను తెలియపరిచారు. గ్రామంలో నూతన పాఠశాల భవన ఏర్పాటుకు సహకరించాలని, అండర్ డ్రైనేజీలు ఏర్పాటు, నూతన విద్యుత్ స్తంభాలను మరమ్మత్తులు చేపట్టాలని కొరారు. అలాగే గ్రామానికీ రోడ్డు సౌకర్యం, కొత్త రోడ్డు మంజూరు చేయాలని గ్రామస్తులు విన్నవించారు. సమస్యలను తెలుసుకున్న ఎమ్మెల్యే గ్రామ సమస్యలను పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని తుర్క ఏనికే పల్లి గ్రామస్తులను ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో సి.ప్రభాకర్ తో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

కష్టాల్లో ఉన్న వారికి అండగా ఉంటాం కష్టాల్లో ఉన్న వారికి అండగా ఉంటాం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, లోకల్ గైడ్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల పరిధిలో ఉన్న కొత్తగట్ల గ్రామంలో డేరా గుడిసెలో నివసిస్తున్న మడకం పుల్లయ్య...
పాలేరు నియోజకవర్గ చిన్నారులకు పీఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా ఉచిత షూస్ పంపిణీ
ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం సందర్భంగా
జెడ్పిటీసి, ఎంపీటీసి స్థానాలకు ఈ నెల 10న ఓటర్ తుది జాబితా విడుదల  
విద్యార్థులకు మార్గదర్శకులు గురువులే - జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్.
తుర్క ఎనికే పల్లి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయండి.
నవభారత నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం..