జెడ్పిటీసి, ఎంపీటీసి స్థానాలకు ఈ నెల 10న ఓటర్ తుది జాబితా విడుదల  

జెడ్పిటీసి, ఎంపీటీసి స్థానాలకు ఈ నెల 10న ఓటర్ తుది జాబితా విడుదల  

 
రంగారెడ్డి   లోకల్ గైడ్ :     
  రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల ఈ నెల తుది ఓటరు జాబితాను వెలువరించడం జరుగుతుందని రంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) కె. శ్రీనివాస్ తెలిపారు. 
  సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో ఇంచార్జ్ జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) కె. శ్రీనివాస్ అధ్యక్షతన గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. 
 ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా ఇప్పటికే ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేయడం జరిగిందని అన్నారు. ముసాయిదా జాబితా, పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని సూచించారు. వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి, అవసరమైన మార్పులు చేర్పులు జరిపిన మీదట సెప్టెంబర్ 10వ తుది జాబితా వెలువరిస్తామని సూచించారు. మండల స్థాయిలో నిర్వహించిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశంలో కూడా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని కోరడం జరిగిందన్నారు. తుది ఓటరు జాబితా రూపకల్పనకు రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. 
  ఈ సమావేశంలో  జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి, డిప్యూటీ సీ.ఈ.ఓ రంగరావు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుండి ఎన్. మహేష్, ఆవుల యాదయ్య, కె.రాజ్ కుమార్, బిఆర్ఎస్ నుండి వనం శ్రీనివాస్, బిజెపి నుండి కె.అనంతయ్య గౌడ్, అంబాజీ శ్రీనివాస్,సిపిఐ(యం) నుంచి పగడాల యాదయ్య,   సిపిఐ  నుండి పాలమాకుల జంగయ్య, పానుగంటి పర్వతాలు, టిడిపి నుండి జె. రవీందర్, సంబంధిత అధికారులు, తదితరులు  పాల్గొన్నారు.
Tags:

About The Author

Latest News

కష్టాల్లో ఉన్న వారికి అండగా ఉంటాం కష్టాల్లో ఉన్న వారికి అండగా ఉంటాం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, లోకల్ గైడ్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల పరిధిలో ఉన్న కొత్తగట్ల గ్రామంలో డేరా గుడిసెలో నివసిస్తున్న మడకం పుల్లయ్య...
పాలేరు నియోజకవర్గ చిన్నారులకు పీఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా ఉచిత షూస్ పంపిణీ
ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం సందర్భంగా
జెడ్పిటీసి, ఎంపీటీసి స్థానాలకు ఈ నెల 10న ఓటర్ తుది జాబితా విడుదల  
విద్యార్థులకు మార్గదర్శకులు గురువులే - జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్.
తుర్క ఎనికే పల్లి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయండి.
నవభారత నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం..