జిల్లా జడ్జిలను మర్యాదపూర్వకంగా కలసిన హుస్నాబాద్ బార్ అసోసియేషన్..

జిల్లా జడ్జిలను మర్యాదపూర్వకంగా కలసిన హుస్నాబాద్ బార్ అసోసియేషన్..


 

హుస్నాబాద్, ఏప్రిల్ 4, లోకల్ గైడ్:

సిద్దిపేట జిల్లా కేంద్రంలో హుస్నాబాద్ బార్ అసోసియేషన్‌కు ఇటీవలే ఎన్నికైన నూతన కార్యవర్గ సభ్యులు శనివారం జిల్లా జడ్జిలు  సాయిరామదేవి ,  జయప్రసాద్ లను మర్యాద పూర్వకంగా కలిశారు.  ఈ భేటీలో ముఖ్యంగా వారు, హుస్నాబాద్ బార్ అసోసియేషన్ అభివృద్ధికి సంబంధించిన అంశాలను  జడ్జిల దృష్టికి తీసుకుని వెళ్లారు. న్యాయవాదులకు ఆధునిక సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో బార్ అసోసియేషన్‌లో డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేయడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. డిజిటల్ లైబ్రరీ ద్వారా తాజా న్యాయ సమాచారాన్ని, తీర్పులను, చట్టపరమైన పుస్తకాలను సులభంగా అందుబాటులోకి తీసుకురావచ్చని, ఇది యువ న్యాయవాదులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వివరించారు. అదేవిధంగా న్యాయవాదుల పనితీరును మెరుగు పరచ డానికి అవసరమైన మౌలిక వసతుల అభివృద్ధి, కోర్టు పరిసరాల్లో సౌకర్యాల విస్తరణ వంటి అంశాలపై చర్చించారు.తీసుకెళ్లారు.ఈ సందర్భంగా జిల్లా జడ్జిలు  సాయిరామదేవి ,  జయ ప్రసాద్ లు మాట్లాడుతూ.. నూతనంగా ఎన్నికైన కార్య వర్గ సభ్యులకు హార్దిక
శుభాకాంక్షలు తెలియజేశా రు. న్యాయవ్యవస్థ పట్ల తమ పూర్తి సహకారం ఉంటుందని వారు తెలిపారు.  తమకు అందజేసిన  వినతులను సానుకూలంగా పరిశీలిస్తామని జడ్జిలు
హామీ ఇచ్చారని వారు తెలిపారు.ఈ భేటీ ద్వారా న్యాయవాదులు న్యాయ వ్యవస్థ మధ్య సమన్వయం మరింత బలపడుతుందని బార్ అసోసియేషన్ సభ్యులు ఆశాభావం వ్యక్తం చేశారు.జడ్జిలను కలిసిన వారిలో హుస్నాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సాయిని మల్లేశం, ఉపాధ్య క్షుడు బాకం సంపత్, సభ్యు లు కన్నోజు రామకృష్ణ, బోయిని సదన్, కొంకట శ్రీనివాస్, జే. కిరణ్ కుమార్, దీకొండ ప్రవీణ్ కుమార్, బండ సంధ్యరాణి, సబ్బని శ్రీదేవి, ఉప్పరపల్లి సంపత్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

ఆరోగ్య వారోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలి. ఆరోగ్య వారోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలి.
హనుమకొండ జిల్లా ప్రతినిధి ఏప్రిల్04(లోకల్ గైడ్ హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో ఆరోగ్య వారోత్సవాల నిర్వహణపై సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్,ప్రజా...
ఓటరు జాబితా సవరణలో రాజకీయ పార్టీల సహకారం తప్పనిసరి
రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శి నవీన్ మిట్టల్ ను
కారేపల్లి రైల్వే భూసేకరణపై కలెక్టరేట్ లో సమావేశం 
భూ సేకరణ ప్రక్రియ ను త్వరగా పూర్తి చేయాలి.
ఆళ్లపల్లిలో జిల్లా కలెక్టర్ అంకిత్ పర్యటన
9న మాజీ మంత్రివర్యులు తన్నీరు.హరీష్ రావు పర్యటన విజయవంతం చేద్దాం.