మా భూమిలో అక్రమ నిర్మాణాలు ఆపండి..!

కోర్టు పరిధిలో ఉన్నదాన్ని ఎలా నిర్మాణం చేపడతారు 

మా భూమిలో అక్రమ నిర్మాణాలు ఆపండి..!

సమస్యపై స్పందించని  గ్రామపంచాయతీ ఈవో .పోలీస్ వారితో కుమ్మక్కై మాపై అక్రమ కేసులు పెడుతున్నారు.విలేకరుల సమావేశంలో మద్దెల గోవర్ధన్ వారి కుమారుల ఆవేదన 

భద్రాద్రి కొత్తగూడెం(లోకల్ గైడ్ జిల్లా ప్రతినిధి):

మాభూమి కోసం మేము పోరాటం చేస్తుంటే   మా మీద పోలీసులు దాడి చేసి అక్రమ కేసులు పెడుతున్నారు అని మద్దెల గోవర్ధన్ వారి కుమారులు జయ సూర్య, రామ్ గురువారం బాబు క్యాంప్ నందు గల జిఎస్ మినీ కన్వర్షన్ హాల్ నందు ఏర్పాటుచేసిన  విలేకరుల సమావేశాలు తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీ గ్రామపంచాయతీ పరిధిలో గల సర్వేనెంబర్ 17/1,17/2,17/3 నందు (5.05) గుంటల భూమి మా తాత అయినా  మద్దెల ఆనందం, 1964 సంవత్సరంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. తాత తదనంతరం వాళ్ళ నాన్నకి చెందవలసిన  భూమి మీద ఒక విద్యా సంస్థ అధినేత కన్ను పడి ఆయన  యొక్క బినామీ అయినటువంటి ఎస్టి  మహిళ  మా తండ్రి వద్ద నుంచి కొనుగోలు చేసినట్టుగా కాగితాలు చూపించి మా భూమి పైకి వచ్చి చదును చేసి నిర్మాణాలను చేపట్టడానికి ప్రయత్నించగా మేము హైకోర్టులో కేసు ఫైల్ చేశామన్నారు. కేసునెంబరు: (డబ్ల్యు.పి.నెం: 47063/2018 మరియు డబ్ల్యు.పి.యస్.ఆర్ నెం: 75705/2018).ఆ తరువాత కొలిశెట్టి వెంకటనర్సయ్య,  మా వద్ద నుండి కొనుగోలు చేసినట్లు కాగితాలు సృష్టించి వారి కుమారుడైనటువంటి కొలిశెట్టి రమణరావుకు 1048 చదరపు గజములు వీలునామా ద్వారా రిజిస్ట్రేషన్ చేయించరు అని (దస్తావేజు నెం: 5/2011, తేది: 07.12.2011) ద్వారా చేయించుకున్నారు. ఈ భూమిని కొలిశెట్టి రమణరావు తేది: 14.02.2018న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, టేకులపల్లి మండలం, కోయగూడెం గ్రామ పంచాయితీ, రావులపాడు గ్రామం,  కాపురస్తులు మాడే వంశీకృష్ణ,  అమ్మినట్లు గాను, మాడే వంశీకృష్ణ తేది: 14.03.2022న భద్రాద్రి కరీంనగర్ జిల్లా, కమలాపుర్ మండలం, దేశరాజపల్లి గ్రామం, కాపురస్తులు  పాలకొండ అరుణ వారికి అమ్మినట్లు కాగితములు సృష్టించిరు అని,ఇలా సృష్టించబడిన తప్పుడు కాగితముల జిరాక్స్ కాపీలతో  పల్లకొండ అరుణ  భద్రాచలం సబ్ డివిజనల్ కోర్టులో దావా నెం: 43/2025 వేయగా కోర్టు అవి స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ యాక్ట్ మరియు బి. యస్.ఎ చట్టం ప్రకారం సాక్ష్యముగా చెల్లని కాగితములు అయినా గమనికలోకి తీసుకోకుండా ఐ.ఎ. నెంబరు: 35/2025 ఇన్ ఓ.యస్ నెం: 43/2025, తేది: 08.07.2025న తాత్కాలికంగా తేది: 19.08.2025 వరకు ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చారని, ఆర్డర్ ముగిసిన ఇంకా అక్రమ నిర్మాణాలు చేపడుతుంటే సంబంధిత  గ్రామ పంచాయతీ ఈవోని కలవగా వారు నాకు సంబంధం లేనట్టుగా వ్యవహరించారు అని అన్నారు. తెర వెనక ఉండి నడిపిస్తున్న ప్రముఖ వ్యక్తి రాజకీయ అండదండలతో
ఎటువంటి అనుమతులు తీసుకోకుండా పోలీసు వారితో కుమ్మక్కై మా మీద క్రిమినల్ కేసులు బనాయించి, మీరు ఆ స్థలంలోకి మరోసారి వెళితే మీ మీద బైండోవర్ కేసు నమోదు చేయించి 6 నెలలు నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయించి మిమ్మల్ని జైలు పంపిస్తామని బెదిరించి దౌర్యంగా మా స్థలంలో   ఇంటి నిర్మాణాలు  చేపడుతున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు.

Tags:

About The Author

Latest News

నాంది పూజతో నడయాడిన శ్వేతార్కలయం నాంది పూజతో నడయాడిన శ్వేతార్కలయం
హనుమకొండ జిల్లా ప్రతినిధి(లోకల్ గైడ్): కాజీపేట స్వయంభు శ్రీ శ్వేతార్క మూల గణపతి దేవాలయ క్షేత్రంలో 2025 గణపతి నవరాత్రి ఉత్సవ కల్యాణోత్సవ వేడుకలు నేటితో  ప్రారంభమయ్యాయి...
మా భూమిలో అక్రమ నిర్మాణాలు ఆపండి..!
ముగియనున్న శ్రావణమాసం బోనాలు
మహిళా శిశు వికాస కేంద్రం నిర్వాహకులకు కలెక్టర్ హితవు
ఉస్మాన్ సాగర్ జలాశయం 2 గేట్ల ఎత్తి నీరు విడుదల
దేశంలో సాంకేతిక రంగం అభివృద్ధికి ఆధ్యుడు  రాజీవ్ గాంధీ
పట్టణంలో పారిశుధ్య పనులు పరిశీలించిన కలెక్టర్