భారత దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన ఏకైక విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్

షాద్నగర్ బాలికలా వసతి గృహంలో ఏఐ ఎస్ ఎఫ్ 90వ ఆవిర్భావ దినోత్సవ వేడుక

భారత దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన ఏకైక విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్

ఏఐఎస్ఎఫ్ జండా ఆవిష్కరించిన రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఎం పవన్ చౌహాన్

 

 


 లోకల్ గైడ్   లోకల్ గైడ్  : నియోజకవర్గం లో ఎస్సీ బాలికల కళాశాల వసతి గృహంలో ఏఐఎస్ఎఫ్ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం జరిగింది. ఏఐఎస్ఎఫ్ రంగారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి ఆకాష్ నాయక్  ఆధ్వర్యంలో ఈ యొక్క  కార్యక్రమం నిర్వహించి దీనికి ముఖ్య అతిథిగా ఏఐఎస్ఎఫ్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పవన్ చౌహాన్  హాజరయ్యారు.అనంతరం రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పవన్ చవాన్ జెండా ఆవిష్కరించారు. అలాగే విద్యార్థులతో ఏఐఎస్ఎఫ్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పవన్ చవాన్ మాట్లాడుతూ...భారత దేశ స్వాతంత్ర్యమే లక్ష్యంగా దేశంలోనే మొట్టమొదటి విద్యార్థి సంఘంగా ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో మహానగరంలో భగత్ సింగ్, రాజ్ గుర్, సుఖ్ దేవ్, ఆజాద్ ల ఇంకా ఎందరో వీరుల ఆశయ సాధన కోసం బబృద్దీన్, ప్రేమ్ నారాయణ భార్గవ్ ల నాయకత్వాన 1936 ఆగస్టు12న ఏఐఎస్ఎఫ్ ఆవిర్భవించింది.                           బ్రిటీష్ సామ్రాజ్యవాదుల బానిసచేర నుంచి మాతృభూమి విముక్తి కై సాగిన వీరోచిత స్వాతంత్ర్య ఉద్యమంలో పొత్తిళ్లలోనే పిడికిళ్లు బిగించి స్వాతంత్ర్యము మా జన్మహక్కు* అని మా అంతం చూసిన - స్వాతంత్ర్యోద్యమ పంతం వీడం అంటూ నినదించి భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం కావాలని, భరతమాత బానిస సంకెళ్ళ నుంచి విముక్తి కావాలని ఎందరో విద్యార్థుల విప్లవ కిషోరులను బలిదానం చేసిన ఘనమైన చరిత్ర కలిగిన దేశములోనే ఏకైక విద్యార్ధి సంఘం పోరాటాలు, త్యాగాలే ధ్యేయంగా ఏర్పాటైన ఈ విద్యార్థి సంఘం స్వాతంత్ర్య అనంతరం ప్రభుత్వ విద్యా పరిరక్షణకై, శాస్త్రీయ విద్య, కామన్ విద్యావిధానం అమలుపై నిరంతరం పోరాటాలు సాగిస్తూ 89 సంవత్సరాలుగా విద్యార్ధుల శ్రేయస్సు కోసం అశేష త్యాగాలు చేస్తూ ఆవిర్భావం నాటి నుంచి నేటి వరకు గల్లి నుండి డిల్లీ వరకు విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఉద్యమాలే ఊపిరిగా - పోరాటాలే ప్రాణంగా - విద్యారంగ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా చదువుతూ పోరాడుతాం - చదువుకై పోరాడుతాం అంటూ తెలంగాణ రైతాంగ పోరాటంలో, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని వీరోచిత పోరాటం, 18 సంవత్సరములకు ఓటుహక్కు ఉద్యమం, బీఈడీ లో బి కామ్ విద్యార్థులకు అవకాశం, మలిదశ తెలంగాణ పోరాటంలో, హాస్టళ్ల సమస్యలపై, విద్య వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న పాలకులపై అలుపెరుగని సమరశీల పోరాటాలు చేసి దేశంలో ఎన్నో విజయాలు సాధించింది .ఏఐఎస్ఎఫ్ శాస్త్రీయ సోషలిజం తన గమ్యంగా, ప్రభుత్వ విద్యను, సెక్యులరిజాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడం తన కర్తవ్యమని, సమరశీల విద్యార్థి ఉద్యమాల నిర్మాణంలో నిమగ్నమైన అఖిల భారత విద్యార్థి సమాఖ్య  89 వసంతాలు పూర్తిచేసుకుని 90వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న  సందర్భంగా విద్యార్థి విద్యార్థులతో కేక్ కట్ చేయించడం జరిగింది విద్యార్థి విద్యార్థులకు అరటి పండ్లు పంచడం జరిగింది.విద్యార్దిని విద్యార్దులకు, మిత్రులకు ఏఐఎస్ఎఫ్ 90వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ షాద్నగర్ కమిటీ సాయి చవాన్, రాహుల్, అరుణ్, ప్రకాష్, సునీల్, గణేష్, అమ్మాయిలు అంకిత, నిఖిత, నందిని, స్వాతి, పవిత్ర, పల్లవి, తదితరులు విద్యార్థి విద్యార్థులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

ఘనంగా గ్రంథ పాలకుల దినోత్సవం  ఘనంగా గ్రంథ పాలకుల దినోత్సవం 
తెలంగాణ సోషల్ వెల్ఫేర్ మహిళా డిగ్రీ కళాశాల గ్రంథాలయం లో ఘనంగా జాతీయ గ్రంథ పాలకుల దినోత్సవాన్ని నిర్వహించారు. భారతదేశంలో 'గ్రంథాలయ శాస్త్ర పితామహుడు' అని  పిలువబడే...
అత్యంత విచారకరమైన సంఘటన – జాగ్రత్త
రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్ధిపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి
అమెరికా నేలపై పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ప్రోకేటివ్ వ్యాఖ్యలు – భారత్‌పై అణు దాడి బెదిరింపులు
ముహమ్మద్ అలీ’ – రింగ్‌లో గర్జించిన మహా వీరుడు, సమాజానికి మార్గదర్శి
భారత్‌పై 50% సుంకం – ట్రంప్ నిర్ణయంపై విమర్శల తుఫాన్
భారత దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన ఏకైక విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్